జెడ్పీసెంటర్(మమబూబ్‌నగర్): అటవీజంతువుల లెక్క పక్కాగా తెలుసుకోవడానికి ఫారెస్ట్ అధికారులు నేటినుంచి గణన చేయనున్నారు. నాలుగు సంవత్సరాలకు ఓ సారి వన్యప్రాణుల సంఖ్యను తెలుసుకోవడానికి ప్రత్యేక సిబ్బందిచే లెక్కిస్తారు. జిల్లాలో మొత్తం 87 వేల ఎకరాల్లో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. అందులో మహబూబ్‌నగర్, నారాయణపేట్, మహ్మదాబాద్‌లను మూడు రేంజ్‌లుగా విభజించారు. ఈ రేంజ్ పరిధిలో నేటినుంచి 29వ తేదీవరకు వన్యప్రాణుల గణన ప్రక్రియ కొనసాగుతుంది.
నాలుగేళ్లకోసారి గణన
జిల్లాలో అసలు ఎన్నిరకాల వన్య ప్రాణులు ఉన్నాయి.. అంతరించినవి ఎన్ని.. ఏయే జంతువుల సంతతి ఎంత ఉంది.. తదితర లెక్కలు తేల్చడానికి అటవీశాఖ అధికారులు సిద్ధమయ్యారు. దేశ వ్యాప్తంగా 2010 నుంచి ప్రతి నాలుగేళ్లకోసారి లెక్కిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న గణన మూడోది. మహబూబ్‌నగర్ జిల్లాలో అటవీ ప్రాంతం చాలా తక్కువ. దట్టమైన అటవీ ప్రాంతం అసలే లేదు. అయితే వన్య ప్రాణుల గణనకు ఫారెస్ట్ అధికారుల కొరత తీవ్రంగా ఉంది. దాన్ని అధిగమించేందుకు హైదరాబాద్ నుంచి 20 మంది బీట్ ఆఫీసర్లు వచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని గణన చేయనున్నారు. ఇందుకోసం ఎన్‌సీసీ విద్యార్థుల సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు.
ప్రతి బీట్‌కు ముగ్గురు
జిల్లాలో మొత్తం 52 బీట్‌లు ఉన్నాయి. ఒక్కో బీట్‌కు ఒక్కోఅ«ధికారి ఉంటాడు. 52 బీట్‌లకు గాను కేవలం 8 మంది బీట్ అధికారులు మాత్రమే ఉన్నారు. వీరితో గణన సాధ్యం కాకపోవడంతో 32 మంది అటవీశాఖ సిబ్బంది, మరో 20 మంది హైదరాబాద్ నుంచి బీట్ అధికారులు వచ్చారు. ఒక్కోబీట్ వద్ద కనీసం ముగ్గురు అధికారులు బృందంగా గణన చేయాల్సి ఉంటుంది. ఇందులో ఒక బీట్ ఆఫీసర్ ఒక్కరు స్థానిక గ్రామాలకు చెందిన వ్యక్తి, మరో అటవీశాఖ సిబ్బంది మొత్తం ముగ్గురు ఒక్క టీంగా ఉంటారు. వీరు ప్రతి రోజు సుమారుగా 4 కి.మి పొడవు నడుచుకుంటూ వెళ్లి గణన చేస్తారు. ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి చికటి పడేదాక గణన ప్రక్రియలో పాల్గొంటారు.
మూడు రోజులు చిరుత, పులుల గణన
మొదటి మూడు రోజులు (22, 23, 24) ట్రయల్‌పాత్ పక్రియ జరుగుతుంది. ఇందులో మాంసహార జంతువుల (పులులు, చిరుతలు) గణనను చేపట్టనున్నారు. ఎవరికి కేటాయించిన బీట్లకు చెందిన సభ్యులు ప్రతి 3 కిమి.నడుచుకుంటూ జంతువుల ఆనవాళ్లను గుర్తిస్తారు. వాటిని డైరెక్ట్‌గా, ఇన్‌డైరెక్ట్‌గా గుర్తిస్తారు. చిరుతల పాద ముద్రలు పడే విధంగా ఏర్పాట్లు చేసి వాటి ఆధారంగా సంఖ్యను గుర్తిస్తారు. 25వ తేదీన గుర్తించిన వివరాలను నమోదు చేస్తారు. 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవు ఉంటుంది. 27 నుంచి శాఖాహార జంతువుల గణను నిర్వహిస్తారు. వాటి ఆవాసాలు, అలవాట్లు, ఎలాంటి ఆహారాన్ని తింటాయని వాటి ద్వారా గుర్తిస్తారు. పూర్తి స్థాయి స్థితి గతులను పరిశీలిస్తారు. అడవిలో జంతువులకు ప్రతీకూల వాతావరణం ఉందా ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని గుర్తిస్తారు. వీటిలో రెండు రకాల గణను చేపట్టనున్నారు. ఒకటి నేరుగా చూసి గుర్తించడం, రెండోది వాటి విస్తరణ పదార్థాల ఆధారంగా గుర్తిస్తారు.
అత్యాధునిన పరిజ్ఞానంతో లెక్కింపు
వన్యప్రాణుల గణనకు అధికారులు అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. మాంసహార, శాకహార జంతువులను విడివిడిగా లెక్కించనున్నారు. గుర్తించిన ప్రాణులకు సంబంధించిన వివరాలను ఎకలాజికల్ యాప్‌లో నమోదు చేస్తారు. గణన సమయంలో తీసిన చిత్రాలు, ఇతర వివరాలను కూడా నయోదు చేయాల్సి ఉంటుంది. దీంతో తప్పుడు సమాచారం నమోదు చేసేందుకు అవకాశం ఉండదు. గండీడ్ మండలంలోని అటవీ ప్రాంతంలో కెమెరాలు అమర్చారు. జంతువుల పాద ముద్రల ఆధారంగా కూడా గణన చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment