పిల్లల చదువుకు 12 లక్షలు | 12 lakhs for children to study | Sakshi
Sakshi News home page

పిల్లల చదువుకు 12 లక్షలు

Published Mon, Jul 3 2017 12:46 AM | Last Updated on Tue, Sep 5 2017 3:02 PM

పిల్లల చదువుకు 12 లక్షలు

పిల్లల చదువుకు 12 లక్షలు

దేశంలో తల్లిదండ్రులు సగటున పెడుతున్న ఖర్చు
ముంబై: భారత్‌లో తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం చేస్తున్న సగటు ఖర్చు రూ.12.22 లక్షలు. ప్రాథమిక పాఠశాల నుంచి పన్నెండో తరగతి వరకు అవుతున్న వ్యయమిది. ప్రపంచ సగటు రూ.28.58 లక్షల (44,221 డాలర్లు)తో పోలిస్తే ఇది చాలా తక్కువని హెచ్‌ఎస్‌బీసీ ‘ద వ్యాల్యూ ఎడ్యుకేషన్‌’సిరీస్‌ ‘హయ్యర్‌ అండ్‌ హయ్యర్‌’ అధ్యయనంలో తేలింది.

ఇందులో ట్యూషన్‌ ఫీజులు, పుస్త కాలు, రవాణా, వసతి తదితర ఖర్చులన్నీ ఉన్నాయి. అం తేకాదు.. 59% మంది భారత తల్లిదండ్రులు పిల్లల విద్య కోసం వేతనాల నుంచి ఖర్చు చేస్తుండగా, మరికొంతమం ది సేవింగ్స్, పెట్టుబడులు, ఇన్సూరెన్స్‌ ద్వారా నిధులు సమకూర్చుకుంటున్నట్లు నివేదిక పేర్కొంది. 32% మంది చేసే ఉద్యోగానికి తోడు అదనపు గంటలు పనిచేస్తున్నారు.

హాంకాంగ్‌ టాప్‌: ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే... హాంకాంగ్‌ తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం అత్యధికంగా సగటున రూ.85.42 లక్షలు ఖర్చు పెడుతున్నారు. తరువాతి స్థానాల్లో యూఏఈ (రూ.64.23 లక్షలు), సింగపూర్‌ (రూ.45.85 లక్షలు) ఉన్నాయి. ఈ జాబితాలో భారత్‌ 13వ స్థానంలో ఉండగా... ఫ్రాన్స్‌ రూ.10.8 లక్షలతో అట్టడుగున ఉంది. భారత్‌తో పాటు 15 దేశాలు... ఆస్ట్రేలియా, కెనడా, చైనా, ఈజిప్ట్, ఫ్రాన్స్, హాంకాంగ్, ఇండోనేసియా, మలేసియా, మెక్సికో, సింగపూర్, తైవాన్, బ్రిటన్, అమెరికా, యూఏఈల్లోని 8,481 మంది తల్లిదండ్రుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ అంచనాకు వచ్చారు.

‘ప్రస్తుతం ప్రపంచ ఉద్యోగ మార్కెట్‌లో నెలకొన్న పోటీ నేపథ్యంలో విద్య కీలకంగా మారింది. దీన్ని గమనించిన తల్లిదండ్రులు తమ పిల్లలు అత్యుత్తమ ఉద్యోగాల్లో స్థిరపడాలని ఆశిస్తున్నారు. ఇందుకు తమ వ్యక్తిగత, జీవనశైలి, ఆర్థిక త్యాగాలు చేసి పిల్లలను చదివిస్తున్నారు’ అని హెచ్‌ఎస్‌బీసీ భారత్‌ హెడ్‌ రామకృష్ణన్‌ చెప్పారు.

పీజీకే అధిక ప్రాధాన్యం: భారత్‌లోని ప్రతి పది మందిలో 9 మంది (94 శాతం) తల్లిదండ్రులు తమ పిల్లలతో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ చేయించాలని భావిస్తు న్నారు. వీరిలో 79 శాతం మంది అందుకు తగిన నిధులు కూడా సమకూర్చుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement