కేంద్ర మంత్రి కారు ఢీకొని యువకుడు బలి | 18-Year-Old Dies After Bike Collides With Union Minister's Jeep | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రి కారు ఢీకొని యువకుడు బలి

Published Sun, Jul 10 2016 12:27 PM | Last Updated on Mon, Sep 4 2017 4:33 AM

కేంద్ర మంత్రి కారు ఢీకొని యువకుడు బలి

కేంద్ర మంత్రి కారు ఢీకొని యువకుడు బలి

పాట్నా: కేంద్రమంత్రికి సంబంధించిన కారు ఢీకొని ఓ పద్దెనిమిదేళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పాట్నా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం కేంద్రమంత్రి రామ్ కృపాల్ యాదవ్ వెళుతుండగా ఆయనకు రక్షణగా వస్తున్న కాన్వాయ్ లో ఓ కారు సరిగ్గా డెహ్రాడూన్ అనే గ్రామం వద్ద రాహుల్ కుమార్ అనే యువకుడు బైక్ పై వస్తుండగా ఢీకొట్టింది.

ఈ కారులో ఉన్న మంత్రి ఆరుగురి సిబ్బంది కూడా గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో బైక్ పూర్తిగా ధ్వంసం అయింది. ఢీకొట్టిన కారు పూర్తిగా పల్టీలు కొట్టింది. ఈ సందర్భంగా మంత్రి రామ్ కృపాల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితుడి కుటుంబంపట్ల సంతాపం వ్యక్తం చేశాడు. ఈ ప్రమాదం అనుకోకుండా జరిగిందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement