ప్రమాదం నా కారు వల్ల జరగలేదు | It did not happen with my car, but with one in the convoy: Union Minister Ram K Yadav on road accident killing one. | Sakshi
Sakshi News home page

ప్రమాదం నా కారు వల్ల జరగలేదు.

Published Mon, Jul 11 2016 11:19 AM | Last Updated on Tue, Oct 16 2018 8:03 PM

ప్రమాదం నా కారు వల్ల జరగలేదు - Sakshi

ప్రమాదం నా కారు వల్ల జరగలేదు

పట్నా: ఆదివారం జరిగిన కాన్వాయ్ ప్రమాదంపై  కేంద్రమంత్రి  రామ్ కృపాల్ యాదవ్ స్పందించారు.  ప్రమాదం తన  వాహనం వల్ల జరగలేదని వివరణ ఇచ్చారు. తన కాన్వాయ్ లోని జీపు ఢీకొని ఆ యువకుడు మృతి చెందాడని ఆయన మీడియాకు తెలిపారు.  పాట్నా జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్న  ఈ ఘటనలో  యువకుడిని తన కారు ఢీకొట్టలేదని  పేర్కొన్నారు.  బాధిత  కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని  రామ్ కృపాల్ తెలిపారు. ఇప్పటికే యువకుడి కుటుంబానికి సాధ్యమైనంత సహాయం చేశానని,   మృతుని  బంధువులను కలిసి సానుభూతి తెలిపానని వెల్లడించారు.  ఆ యువకుడు తమ బిడ్డలాంటివాడని వ్యాఖ్యానించారు.

 అయితే తన కాన్వాయ్‌లోని ఒక వాహనం మాత్రమే యువకుడిని ఢీకొట్టడంతో అతడు మృతి చెందాడని  సెలవివ్వడం  విమర్శలకు తావిస్తోంది. కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై పలువురు మండిపడ్డారు. మంత్రి ఎస్కార్ట్ జీపు ఢీకొట్టడంతోనే యువకుడు మృతి చెందినప్పటికీ... తన కారు యువకుడిని ఢీకొట్టలేదని విడ్డూరంగా సమాధానం చెప్పడంపై  ఆగ్రహం వ్యక్తం చేశారు..

కాగా ఆదివారం ఉదయం కేంద్రమంత్రి రామ్ కృపాల్ యాదవ్ వెళుతుండగా ఆయనకు రక్షణగా వస్తున్న కాన్వాయ్ లోని వాహనం  డెహ్రాడూన్ గ్రామంలో రాహుల్ కుమార్ (18 )  యువకుడు బైక్ పై వస్తుండగా ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు.  ఈ ప్రమాదంలో బైక్ పూర్తిగా ధ్వంసం కాగా,   కారు పూర్తిగా పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో  ఆరుగురు పోలీసులు కూడా తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement