Rahul Kumar
-
ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన హిజ్రా ప్రితికా యాషిన్
కేకేనగర్ : దేశంలోనే మొట్టమొదటి హిజ్రా ఎస్ఐగా ప్రితికా యాషిన్ బాధ్యతలు స్వీకరించారు. తమిళనాడులోని సేలం కందంపట్టికి చెందిన కళైయరసన్ లారీ డ్రైవర్. అతని భార్య సుమతి. ఈ దంపతుల కుమారుడు రాహుల్ కుమార్. ఇతడు హిజ్రాగా మారి ప్రితికా యాషిన్ (26)గా పేరు మార్చుకున్నాడు. ప్రితికా సేలం ప్రభుత్వ కళాశాలలో బీసీఏ చదివి 2016న పోలీసు ఎంపికలో ఎస్ఐ పరీక్ష రాసి యాషిన్ ఉత్తీర్ణత సాధించారు. అనంతరం చెన్నైలో ఏడాది కాలం శిక్షణ పూర్తి అయిన క్రమంలో ధర్మపురి జిల్లాలో పోస్టింగ్ కేటాయించారు. ధర్మపురి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శంకర్ నుంచి నియామక ఆదేశాలతోపాటు అభినందనలు అందుకున్నారు. -
‘గురుకులం’ విద్యార్థుల అదృశ్యం
హిందూపురం రూరల్ : మలుగూరు ఏపీఆర్ఎస్ గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు అదృశ్యం కావడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం... పైన పేర్కొన్న పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పరిగి మండలం విట్టాపల్లికి చెందిన రాహుల్ కుమార్, 9వ తరగతి చదివే హిందూపురంలోని లక్ష్మీపురానికి చెందిన శివశంకుమార్ ఈ నెల 17న పాఠశాల నుంచి అదృశ్యమయ్యారు. విషయాన్ని తెలుసుకున్న ఉపాధ్యాయులు విద్యార్థుల ఆచూకీ కోసం పరిసరాల్లో గాలించారు. ఫలితం లేకపోవడంతో వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో వారు గురువారం తమకు ఫిర్యాదు చేశారని స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆదినారాయణ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. -
పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసిందని..
న్యూఢిల్లీ: పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసిన స్నేహితురాలిని ఓ యువకుడు కత్తితో ఆమె గొంతుకోశాడు. ఢిల్లీలోని మంగోల్‌పురి ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. నిందితుడు రాహుల్ కుమార్‌ను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స చేసి 18 కుట్లు వేశారు. రాహుల్ (24) ఓ పోలీస్ కానిస్టేబుల్ కొడుకు. ఏడాదిన్నరగా రాహుల్, బాధితురాలు (17) స్నేహంగా ఉంటున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని ఆ అమ్మాయి రాహుల్‌ను ఒత్తిడి చేసింది. శుక్రవారం ఆ అమ్మాయి ఇంటికి వెళ్లిన రాహుల్ కూరగాయాలు కోసే కత్తిని తీసుకుని ఆమె గొంతు కోశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయి ఓ పబ్లిక్ టాయ్లెట్లో దాక్కున్నాడు. పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని కత్తిని స్వాధీనం చేసుకున్నారు. వివాహం చేసుకునేందుకు దుర్గా పూజ వరకు వేచిచూడమని స్నేహితురాలికి చెప్పానని, అప్పటికి ఆమెకు 18 ఏళ్లు వస్తాయని, ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెబితే ఆమె వినలేదని రాహుల్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. వెంటనే వివాహం చేసుకోవాలని, లేకుంటే రేప్ కేసు పెడతానని హెచ్చరించిందని రాహుల్ పోలీసుల విచారణలో చెప్పాడు. కాగా పోలీసులు బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకోవాల్సి ఉంది. రాహుల్ ఆరోపణలను బాధితురాలి కుటుంబ సభ్యులు తోసిపుచ్చారు. ఇద్దరూ సన్నిహితంగా ఉంటున్నారని, రాహుల్ గతంలో తమ అమ్మాయిని వేధించాడని చెప్పారు. నిందితుడు మరికొంతమంది అమ్మాయిలను వేధించినట్టు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. -
ప్రమాదం నా కారు వల్ల జరగలేదు
పట్నా: ఆదివారం జరిగిన కాన్వాయ్ ప్రమాదంపై కేంద్రమంత్రి రామ్ కృపాల్ యాదవ్ స్పందించారు. ప్రమాదం తన వాహనం వల్ల జరగలేదని వివరణ ఇచ్చారు. తన కాన్వాయ్ లోని జీపు ఢీకొని ఆ యువకుడు మృతి చెందాడని ఆయన మీడియాకు తెలిపారు. పాట్నా జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనలో యువకుడిని తన కారు ఢీకొట్టలేదని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని రామ్ కృపాల్ తెలిపారు. ఇప్పటికే యువకుడి కుటుంబానికి సాధ్యమైనంత సహాయం చేశానని, మృతుని బంధువులను కలిసి సానుభూతి తెలిపానని వెల్లడించారు. ఆ యువకుడు తమ బిడ్డలాంటివాడని వ్యాఖ్యానించారు. అయితే తన కాన్వాయ్‌లోని ఒక వాహనం మాత్రమే యువకుడిని ఢీకొట్టడంతో అతడు మృతి చెందాడని సెలవివ్వడం విమర్శలకు తావిస్తోంది. కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై పలువురు మండిపడ్డారు. మంత్రి ఎస్కార్ట్ జీపు ఢీకొట్టడంతోనే యువకుడు మృతి చెందినప్పటికీ... తన కారు యువకుడిని ఢీకొట్టలేదని విడ్డూరంగా సమాధానం చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. కాగా ఆదివారం ఉదయం కేంద్రమంత్రి రామ్ కృపాల్ యాదవ్ వెళుతుండగా ఆయనకు రక్షణగా వస్తున్న కాన్వాయ్ లోని వాహనం డెహ్రాడూన్ గ్రామంలో రాహుల్ కుమార్ (18 ) యువకుడు బైక్ పై వస్తుండగా ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో బైక్ పూర్తిగా ధ్వంసం కాగా, కారు పూర్తిగా పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు పోలీసులు కూడా తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. -
కేంద్ర మంత్రి కారు ఢీకొని యువకుడు బలి
పాట్నా: కేంద్రమంత్రికి సంబంధించిన కారు ఢీకొని ఓ పద్దెనిమిదేళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పాట్నా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం కేంద్రమంత్రి రామ్ కృపాల్ యాదవ్ వెళుతుండగా ఆయనకు రక్షణగా వస్తున్న కాన్వాయ్ లో ఓ కారు సరిగ్గా డెహ్రాడూన్ అనే గ్రామం వద్ద రాహుల్ కుమార్ అనే యువకుడు బైక్ పై వస్తుండగా ఢీకొట్టింది. ఈ కారులో ఉన్న మంత్రి ఆరుగురి సిబ్బంది కూడా గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో బైక్ పూర్తిగా ధ్వంసం అయింది. ఢీకొట్టిన కారు పూర్తిగా పల్టీలు కొట్టింది. ఈ సందర్భంగా మంత్రి రామ్ కృపాల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితుడి కుటుంబంపట్ల సంతాపం వ్యక్తం చేశాడు. ఈ ప్రమాదం అనుకోకుండా జరిగిందని అన్నారు. -
ఐపీఎస్ అంటూ ఉన్నతాధికారులకు టోపీ
చండీగఢ్: పంజాబ్ మాజీ మంత్రి జ్ఞాన్ చంద్ మనవడు, దీనానగర్ మాజీ ఎమ్మెల్యే రూప్ రాణి కొడుకు రాహుల్ కుమార్ ఐపీఎస్ అధికారినంటూ జిల్లా స్థాయి ప్రభుత్వ అధికారులను మోసం చేశాడు. విజిలెన్స్ ఎస్పీగా పరిచయం చేసుకుని రాహుల్ కుమార్ 60 మందికిపైగా ప్రభుత్వ అధికారులను బురిడీ కొట్టించాడు. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. రాహుల్ కుమార్ ప్రభుత్వ అధికారులను బెదిరించి వారి నుంచి 30 లక్షల రూపాయలకు పైగా వసూలు చేసినట్టుగా ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు అమృత్సర్ సీనియర్ ఎస్పీ పాటిల్ కే బలరామ్ చెప్పారు. కాగా అధికారుల నుంచి నిందితుడు ఎంత మొత్తం వసూలు చేశాడన్నది తేలాల్సివుందని తెలిపారు. రాహుల్ మోసం చేసినవారిలో సూపరింటెండెంట్ ఇంజనీర్ ర్యాంక్ అధికారులు, జిల్లా ఆహార సరఫరా కంట్రోలర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జిల్లా వైద్యశాఖ అధికారి, సహకార సంఘాల అధికారులు, రోడ్డు రవాణ అధికారులు ఉన్నారు. గత నెలలో అమృత్సర్ డివిజన్ అటవీ శాఖ అధికారి ఎస్ కే సాగర్.. విజిలెన్స్ అధికారులు తనను డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, ఇవ్వకుంటే అవినీతి కేసు పెడతామని బెదిరిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాహుల్ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. విజిలెన్స్ అధికారులు, పోలీసులు కలసి నిఘా వేసి ధర్మశాలలో రాహుల్‌ను అరెస్ట్ చేశారు. -
డియర్ ఆనంద్ సర్.. జీవితాంతం రుణపడి ఉంటా
రాంచీ: ద్రోహం చేసినవారిని మరిచిపోయినా ఫర్వాలేదుగానీ.. సాయం చేసిన వారిని మాత్రం ఎప్పటికీ మరువకూడదు. ఎందుకంటే వారే మన భవిష్యత్తు బాటలో మరో రాయిని మన జీవిత సౌదానికి అందించిన ఘనులు. వారిపట్ల కృతజ్ఞతా భావంతో ఉండటం దైవలక్షణం. మనం గొప్ప వాళ్లయిన తర్వాత సాయం చేసిన వారికి ఓసారి కృతజ్ఞత భావాన్ని తెలియజేయడం వల్ల దానిని పొందిన వ్యక్తి ఎంత అద్భుతంగా భావిస్తాడో ఊహిస్తేనే అమితానందం. అయితే, ఇలాంటి కృతజ్ఞతలు పొందేవారు ఈ రోజుల్లో అరుదయ్యారు.. అలా చెప్పేవారు కూడా కరువయ్యారు. కానీ జార్ఖండ్‌కు చెందిన ఓ పేద విద్యార్థి మాత్రం తాను పొందిన సాయాన్ని మరిచిపోలేదు. ఆ సాయం చేసిన వ్యక్తిని లేఖ ద్వారా అలుముకున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనీ అనుకుంటున్నారా.. బీహార్‌లో ఐఐటీకి ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇచ్చే అత్యున్నత సంస్థ సూపర్ 30 ఇన్స్టిట్యూట్ యజమాని ఆనంద్ కుమార్. సాయం పొందిన బాలుడు రాహుల్ కుమార్(19). ఒకసారి అతడి లేఖను పరిశీలిస్తే.. డియర్ ఆనంద్ సర్, ధన్యవాదాలు. నా జీవితంలో ఎలాంటి మార్పు వచ్చిన అందుకు కారణం మీరే. జార్ఖండ్ రాష్ట్రంలోని హజరీబాగ్ జిల్లాలో మా నాన్న ఓ మాములు రైతు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో జీవిస్తున్నాం. అక్కడ ఫోన్లు, నెట్ వర్క్‌లు ఏమీ ఉండవు. ఎలాంటి సౌకర్యాలు ఉండవు. నాకు వివాహం అయిన ఓ సోదరి, పాఠశాలలో చదువుతున్న ఇద్దరు సోదరులు ఉన్నారు. మా నాన్న సంవత్సరంలో ఐదు నెలలు మాకున్న కొద్దిపాటి భూమిలో సాగు చేస్తారు. అది కూడా వాతావరణం సహకరిస్తేనే. మిగతా రోజుల్లో కోల్ కతా వెళ్లి భవన నిర్మాణ కూలీగా పనులు చేస్తారు. నేను ఒక్కోసారి ఒకపూట భోజనంతోనే సరిపెట్టుకునే ఇంట్లో పెరిగాను. ఎనిమిదో తరగతిలో ఉండగా నవోదయ పాఠశాలకు ఎంపికయ్యాను. ఆ సమయంలో నేను మా సీనియర్ భరత్ యాదవ్‌ను గమనించాను. అతడికి ఉన్న అంకితభావం నన్ను అమితంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆయనొక ఐఐటీయన్. నేను కూడా మా సీనియర్ అంతటి వాడిని కావాలని మనసులో ప్రతిరోజూ స్మరించుకుంటుంటాను. పాఠశాల తర్వాత మీ సూపర్-30 ఇన్ స్టిట్యూట్ గురించి విని ఎంతో క్లిష్టమైన ఎంపిక విధానాన్ని దాటుకొని ప్రవేశం పొందాను. ఆనంద్ సర్ మీరే నాకు జీవితంలో అతిపెద్ద స్ఫూర్తి. పెద్దపెద్ద కుటుంబాల మాదిరిగా మా కుటుంబం లక్షల్లో ఫీజులు చెల్లించలేదు. ఈ విషయం గుర్తించిన మీరు నాకు ఉచితంగా శిక్షణ ఇచ్చి, నా ఖర్చులు భరించి, పోషణ భారాన్ని మోసి ఐఐటీలో ప్రవేశం పొందేందుకు కావాల్సిన నమ్మకాన్ని ధైర్యాన్నిచ్చారు. నేను ఖరగ్‌పూర్ ఐఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ చదవాలనుకుంటున్నాను. గొప్ప పారిశ్రామికవేత్త కావాలనేది నా లక్ష్యం. అది కూడా ఇండియాలోనే. భారత్‌లో ఈ రంగంలో సేవలు అందించే అవకాశాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. విదేశాల్లోకి ఎగిరిపోయి అక్కడే ఉండిపోవాలనుకుంటున్నవారిలో నేను ఎప్పటికీ ఉండను. మా అమ్మనాన్నలు ముసలితనంలో ఎలాంటి పనులు చేయలేనందున వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. మా గ్రామంలో ఆస్పత్రి కట్టించాలనేది నా ధ్యేయం. ఐఐటీ ప్రవేశ పరీక్షలో విజయం సాధించిన నన్ను చూసి మా వాళ్ల ఆనందానికి అవధుల్లేవు. మా అమ్మయితే భావోద్వేగాన్ని ఆపుకోలేక ఆనంద భాష్పాలు రాల్చింది. నాన్న కూడా అంతే. దీనంతటికీ కారణం మీ చలవే. ఐఐటీకి సరిపోయేంత క్వాలిటీ విద్యనందించే పాఠశాలలు మన దేశంలో ఉంటే అంతకంటే మంచి సందర్భం మరొకటి ఉండదని అనుకుంటున్నాను. ఎందుకంటే పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లలో డబ్బులు పెట్టి నాలాంటి వారు చదవలేరు కదా! నాలాంటి వారు ఈ దేశంలో ఎంతో మంది ఉన్నారు. నేను మాత్రం చాలా అదృష్టవంతుడిని. మీరు నాజీవితంలో ఉండటం మిగతా అన్నింటి కంటే కూడా గొప్ప విషయం... అదృష్టం.. మీకు జీవితాంత రుణపడి ఉంటాను. మీకోసం ఏమైనా చేస్తాను. చూశారుగా ఎంత పరిపక్వతతో రాహుల్ కుమార్ ఈ లేఖ రాశాడో.. ఇలా ఒక్క రాహులే కాదు.. ఎంతో మంది పేద విద్యార్థులకు ఆనంద్ కుమార్ సేవలు అందిస్తున్నారు.