పాట్నా : బిహార్‌లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. ఇప్పటికే రాష్ర్ట బీజేపీ కార్యాలయాన్ని కరోనా హాట్‌స్పాట్‌గా గుర్తించిన ఒక రోజు వ్యవధిలోనే రాజ్‌భవన్‌కు సైతం కోవిడ్ సెగ తగిలింది. ఇప్పటికే 20 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మరికొంత మంది ఫలితాలు రావాల్సి ఉంది. బిహార్ రాష్ర్ట వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో జూలై 16నుంచి 31 వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా లాక్‌డౌన్ ప్రకటించిన రెండు రోజుల వ్యవధిలోనే కరోనా కేసులు రెండు రెట్లు పెరిగాయి.
కేసులు పెరుగుతున్నా నితీష్‌కుమార్ ప్రభుత్వం ఎటువంటి దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదని ఎంపీ అఖిలేష్ సింగ్ ఆరోపించారు. రాజకీయాలు తప్పా ప్రజల సంక్షేమం గురించి ఆయనకు పట్టడం లేదన్నారు. ఇతర రాష్ర్టాలతో పోలీస్తే బిహార్‌లో కరోనా టెస్టింగ్ సామర్థ్యం తక్కువగా ఉందని పేర్కొన్నారు. అతి త్వరలోనే బిహార్‌లో సామాజిక వ్యాప్తి ప్రారంభమవుతుందని అన్నారు. రాష్ర్ట బీజేపీ అద్యక్షుడు సంజయ్ జైస్వాల్‌తో సహా ఆయన భార్య, తల్లికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు బీజేపీ నేతలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
(బిహార్ : బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడికి కరోనా )
Comments
Please login to add a commentAdd a comment