సాక్షి, హైదరాబాద్: కోవిడ్19 మూడో వేవ్ ఉధృతి నేపథ్యంలో గణతంత్ర దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. గతంలో పరేడ్ గ్రౌండ్స్‌లో గణతంత్ర దిన వేడుకలను ఘనంగా నిర్వహించే విషయం తెలిసిందే. కోవిడ్ నేపథ్యంలో గత రెండేళ్లుగా నాంపల్లి లోని పబ్లిక్ గార్డెన్స్‌లో ఈ వేడుకలు నిర్వహిస్తు న్నారు.
కాగా ఈ గణతంత్ర దినోత్సవాన రాజ్ భవన్ ప్రాంగణంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ జెండాను ఆవిష్కరిం చనున్నారు. ఉదయం 7 గంటలకు రాజ్ భవన్‌లో జరిగే వేడుకల్లో ఆమె పాల్గొంటారు. అనంతరం ప్రత్యేక విమానం ద్వారా నేరుగా ఆమె పుదుచ్చేరికు చేరుకుని అక్కడ ఉదయం 9 గంటలకు జెండావిష్కరణ గావిస్తారు. రాజ్ భవన్‌లో జరిగే వేడుకలకు స్వల్ప సంఖ్యలో మాత్రమే అతిథులను ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment