న్యూఢిల్లీ: జాట్ల ఉద్యమం కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంగళవారం మరో 210 రైళ్లను రద్దు చేశారు. రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉత్తరాదిన జాట్లు చేస్తున్న ఉద్యమం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే.
హరియాణా, పంజాబ్, రాజస్థాన్, చండీగఢ్, జమ్ము కశ్మీర్ మీదుగా వెళ్లాల్సిన రైళ్లపై ప్రభావం పడింది. ఇప్పటివరకు మొత్తం 1152 రైళ్లను రద్దు చేశారు. ఢిల్లీ-పానిపట్-అంబాల, ఢిల్లీ-రోహ్టక్-భటిండా రైల్వే రూట్లను మూసివేశారు. జాట్ ఉద్యమకారులు భారీ స్థాయిలో రైల్వే ఆస్తులకు నష్టం చేకూర్చారు. 12 రైల్వే స్టేషన్లకు నిప్పుపెట్టారు. మూడు రైలింజన్ల, ట్రాక్లను ధ్వంసం చేశారు.
జాట్ల ఉద్యమం; మరో 210 రైళ్లు రద్దు
Published Tue, Feb 23 2016 5:40 PM | Last Updated on Sun, Sep 3 2017 6:15 PM
Advertisement