లాహోర్: కొన్నిరోజులుగా లాహోర్-ఢిల్లీ మధ్య ఆగిపోయిన రాకపోకలు మళ్లీ ప్రారంభమయ్యాయి. హర్యానాలో జాట్‌లు నిర్వహించిన రిజర్వేషన్ల ఉద్యమంతో ఈ మార్గంలో రాకపోకల్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. శాంతిభద్రతల దృష్ట్యా ఈ మార్గం మీదుగా ప్రయాణించే సంఝౌత రైలును, లాహోర్-ఢిల్లీ దోస్తీ బస్సును నిలిపివేశారు.
జాట్‌ల నిరసనలు చల్లబడి శాంతియుత వాతావరణం నెలకొంటుండటంతో ఇరు దేశాల ప్రభుత్వాలు రాకపోకలు పునరుద్ధరించాలని నిర్ణయించాయి. వారంలో రెండు రోజులు(సోమ, గురువారాలు) సంఝౌత రైలు ఇండియా నుంచి బయల్దేరుతుంది. వారం కింద ఇండియా నుంచి వెళ్లిన ప్రయాణికుల వీసాల గడువును పాకిస్థాన్ ప్రభుత్వం పొడగించింది. భారత్ నుంచి పాక్ వెళ్లిన ప్రయాణికులు తిరిగి స్వదేశానికి ఎప్పుడు చేరుతామోనని బిక్కుబిక్కుమంటూ ఎదురుచూశారు. రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారు తిరిగి రానున్నారు.
రాకపోకలు మళ్లీ షురూ...!
Published Thu, Feb 25 2016 10:26 PM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM
Advertisement
Advertisement