న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ఆహార భద్రతకు సంబంధించిన బిల్లు అమలు చేసేందుకు 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమ్మతించినట్లు కేంద్రప్రభుత్వం తెలిపింది. 11 రాష్ట్రాల్లో ఇటీవలే పథకాన్ని ప్రారంభించారు. జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) ప్రకారం ఇప్పటివరకు గుర్తించిన 53 కోట్ల లబ్ధిదారుల్లో 11 కోట్ల మందికి పైగా కిలో రూ.2కు గోధుమలు, రూ.3కు కిలో బియ్యం పొందుతున్నారు. రికార్డుల కంప్యూటరీకరణ ద్వారా 61.43లక్షల బోగస్ కార్డుల ఏరివేత పూర్తయిందని.. దీని వల్ల నెలకు రూ. 4200 కోట్లు ఆదా అవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.