
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ (కోవిడ్-19) చాపకింద నీరులా వ్యాప్తిచెందుతోంది. శుక్రవారం నాటికి 230గా ఉన్న కరోనా పాజిటివ్ కేసులు.. శనివారం మధ్యాహ్నం ఆ సంఖ్య 271కి చేరింది. ఈ మేరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్‌ఆర్) శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు మహారాష్ట్రలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకు 67 కేసులు నిర్థారణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి వెల్లడించారు. దేశం మొత్త మీద ఇప్పటివరకూ ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్, ముంబైలలో ఒకొక్కరు చొప్పున నలుగురు కోవిడ్ కారణంగా మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఆదివారం దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూను పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. (11 వేలు దాటిన కరోనా మృతులు)
Comments
Please login to add a commentAdd a comment