కర్ణాటకకు బంగ్లాదేశీయుల బెడద
తమ రాష్ట్రంలో మొత్తం 748మంది బంగ్లాదేశీయులు ఉన్నారని, వారిలో 283మంది ఫారినర్స్ చట్టం ప్రకారం అనుమతి లేకుండా ఉన్నారని, వారిని గుర్తించి తరిమేసే ప్రక్రియ ప్రారంభమైందని పరమేశ్వర పేర్కొన్నారు. ఇప్పటికే గ్రామీణ, పట్టణ, జిల్లా, నగరాల స్థాయిలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేశామని, వారంతా అక్రమంగా ఉంటున్నవారిని పట్టుకుని పంపించేస్తారని చెప్పారు. అక్రమ వలసదారులకు ప్రభుత్వం అండగా ఉంటోందంటూ ప్రతిపక్షం చేసిన ఆరోపణలు కొట్టి పారేసింది. ఇలాంటివారితోనే అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లుతుందని, ఆ విషయం ప్రభుత్వానికి తెలుసని, అందుకే తాము సీరియస్ ఉన్నామని వెల్లడించింది.