రేప్ చేసి..ఆపై యాసిడ్ పోసి.. | 3 Men Allegedly Rape Woman, Pour Acid On Her Eyes To Hide Their Identities | Sakshi
Sakshi News home page

రేప్ చేసి..ఆపై యాసిడ్ పోసి..

Published Sat, Aug 27 2016 6:27 PM | Last Updated on Tue, Aug 28 2018 7:24 PM

రేప్ చేసి..ఆపై యాసిడ్ పోసి.. - Sakshi

రేప్ చేసి..ఆపై యాసిడ్ పోసి..

కాన్పూర్:  ఉత్తరప్రదేశ్ లో అత్యంత హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు మృగాళ్లు ఒక యువతిపై అత్యాచారాని పాల్పడ్డారు. తమను గుర్తు పట్టకుండా ఉండటానికి ఆమె ముఖం, కళ్లపై ఆసిడ్ పోశారు. ఆపై ఆమెను రైల్వే ట్రాక్ పై పడేశారు. ఈ ఘటన మహిళలపై అత్యాచారాలు నిత్యకృత్యంగా మారిన యూపీలోని అలహాబాద్ లో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను హుటాహుటిన  ఆస్పత్రికి తరలించారు.

కాన్పూర్ ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం... యాసిడ్ దాడిలో మహిళ గొంతు దెబ్బతిన్నదని, ఒక కన్ను  పూర్తిగా కాలిపోయిందని చెప్పారు. మహిళ చేతివేళ్లతో చేసిన సైగల ద్వారా శుక్రవారం తెల్లవారు జామున ఆమెపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని గుర్తించామని తెలిపారు. కేసును నమోదు చేసి విచారణ జరుపుతున్నామని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement