
ఢిల్లీ భవితవ్యం తేల్చనున్న 311 మంది సెంచూరియన్లు
న్యూఢిల్లీ: ఈ నెల 7 న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఒక విశేషం ఉంది. అదేంటంటే ఈ ఎన్నికల్లో 311 మంది వందేళ్లు వయసు దాటిన తాతలు, బామ్మలు ఓటు వేయనున్నారు. ఈ ఎన్నికల్లో వీరు కూడా తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని తహతహలాడుతున్నారు. చూద్దాం వీరి అభ్యర్థులు ఏ మేరకు విజయం సాధిస్తారో...