కిరణ్బేడీ ఎందుకు జంకుతున్నారు: కేజ్రీవాల్ | Delhi elections 2015: AAP releases party manifesto for Delhi assembly polls | Sakshi
Sakshi News home page

కిరణ్బేడీ ఎందుకు జంకుతున్నారు: కేజ్రీవాల్

Published Sat, Jan 31 2015 12:47 PM | Last Updated on Sat, Sep 2 2017 8:35 PM

కిరణ్బేడీ ఎందుకు జంకుతున్నారు: కేజ్రీవాల్

కిరణ్బేడీ ఎందుకు జంకుతున్నారు: కేజ్రీవాల్

న్యూఢిల్లీ : తమతో చర్చకు బీజేపీ నేత, మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ జంకుతున్నారని ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. శనివారం న్యూఢిల్లీలో ఆప్ ఎన్నికల మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. అనంతరం కేజ్రీవాల్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... కేంద్రమంత్రులంతా తమ పనులు మానేసి ఢిల్లీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేప్పారు. ఈ సారి సీఎం అయితే గతంలోని 49 రోజుల పాలన కంటే మరింత మెరుగైన పాలన అందిస్తానని ఆయన న్యూఢిల్లీ ప్రజలకు భరోసా ఇచ్చారు.

తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు సగానికి సగం తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఆడిత్ తర్వాత నిర్థిష్ట ఛార్జీ ఫిక్స్ చేస్తామన్నారు. ఆప్ను చూసి బీజేపీ భయపడుతోందని విమర్శించారు. న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఆప్ తన మేనిఫెస్టోలో 70 అంశాలతో కూడిన యాక్షన్ ప్లాన్తో విడుదల చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement