'కేజ్రీవాల్ ఓ నక్సలైట్.. గెలిచినా పదవిలో ఉండలేరు' | 'Naxalite' Kejriwal will leave office within a year: Swamy | Sakshi
Sakshi News home page

'కేజ్రీవాల్ ఓ నక్సలైట్.. గెలిచినా పదవిలో ఉండలేరు'

Published Sun, Feb 8 2015 9:11 PM | Last Updated on Sat, Sep 2 2017 9:00 PM

'కేజ్రీవాల్ ఓ నక్సలైట్.. గెలిచినా పదవిలో ఉండలేరు'

'కేజ్రీవాల్ ఓ నక్సలైట్.. గెలిచినా పదవిలో ఉండలేరు'

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ని ఓ నక్సలైట్ అంటూ బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి అభివర్ణించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధిస్తే, కేజ్రీవాల్ సంవత్సరం లోపే సీఎం పదవిని మళ్లీ వదిలేస్తారని విమర్శించారు. కేజ్రీవాల్ నక్సలైట్ స్వభావం కలిగిన వ్యక్తి అని, ఆయన సహచరులు అందరూ నక్సలైట్ ఉద్యమంతో సంబంధం ఉన్నవారు కావడంతో ప్రభుత్వాన్ని నడపలేరని సుబ్రమణ్య స్వామి తెలిపారు.

ఈ ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా జీరో అయిందన్నారు. సంప్రదాయక  కాంగ్రెస్ ఓటర్లందరూ ఆప్ వైపు మొగ్గు చూపారని, ఈ ఎన్నికల ఫలితాలు మోదీపై ఏ విధమైన ప్రభావాన్ని చూపవని తెలిపారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కేజ్రీవాల్కి అనుకూలంగా వెల్లడైన నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి పైవిధంగా పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement