సాక్షి, న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌లో సమయంలో తమ సోంత రాష్ట్రాలకు తిరిగి పయనమవుతున్న క్రమంలో సుమారు 42 మంది వలస కార్మికులు రోడ్డు ప్రమాదాల్లో మరణించినట్లు సేవ్ లైఫ్ ఫౌండేషన్ తమ నివేదికలో పేర్కొంది. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు మార్చి 24 నుంచి మే 3 వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌కు పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదాలపై సేవ్ లైఫ్ ఫౌండేషన్ వారు నివేదికను తయారు చేసింది. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌లో రోడ్డు ప్రమాదాల వల్ల మొత్తం 140 మంది మరణించినట్లు నివేదికలో వెల్లడించింది. (17 రోజుల పసికందుతో బాలింత కాలినడక)
కాగా ఈ మరణాలలో 30 శాతం మంది రోడ్డు ద్వారా కాలి నడకన వెళ్లిన వారు, ఇక ఏలాంటి ప్రజా రవాణ సౌకర్యం లేకపోవడంతో ట్రాక్కులలో చాటుగా తమ సొంత రాష్ట్రాలకు చేరుకునేందుకు ప్రయత్నించిన వారే ఉన్నారు. నడక ప్రయాణం చేస్తూ మరణించిన 42 మంది కార్మికుల్లో 8 మంది ఎనిమిది మంది ట్రక్కులు, వేగవంతమైన కార్లు ఢీకొనడంతో మరణించినట్లు నివేదికలో పేర్కొంది. ఇక లాక్‌డౌన్ అమలైనప్పటీ నుంచి ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 600 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు ఈ ఫౌండేషన్ తన నివేదికలో పేర్కొంది. కాలి నడకన బయలుదేరి మరణించిన 42 మంది వలస కార్మికులే కాకుండా, అత్యవసర సేవలలో పనిచేసే 17 మంది కార్మికులు కూడా ఈ రోడ్డు ప్రమాదాల్లో మరణించినట్లు తెలిపింది. (వారం పాటు అహ్మదాబాద్ షట్‌డౌన్)
ఇక నివేధికపై ఆ ఫౌండేషన్ సీఈఓ పీయూష్ తివారి మాట్లాడుతూ.. ‘ఈ మరణాల సంఖ్యను కనీసంగానే పరిగణించాలి. ఎందుకంటే ఇందులో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సమగ్ర సమాచారం లేదు. ప్రమాదాల్లో ఎక్కువ సంఖ్యలో మరణించిన వారి సమాచారం మంత్రమే ఉంది. ఇక ఒకరిద్దరూ మరణించిన వారి సమాచారాన్ని ఈ నివేదికలో పేర్కొనలేదని" అని తెలిపారు. అంతేగాక 140 మరణాలలో 100కు పైగా న్యూఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, అస్సాం, కేరళ, కర్ణాటక, రాజస్థాన్, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నట్లు గుర్తించామన్నారు. లాక్‌డౌన్ సమయంలో కూడా గరిష్ట మరణాలు రోడ్డు ప్రమాదాల కారణంగానే చోటుచేసుకున్నట్లు పంజాబ్ రాష్ట్రం నివేదిక ఇచ్చిందని, ఆ తర్వాత కేరళ, న్యూఢిల్లీ, కర్ణాటకలు ఉన్నాయన్నారు. (గ్యాస్ లీక్ బాధితుల పట్ల శాపంగా మారిన కరోనా)
"ప్రతి ఏడాది భారత దేశంలో అత్యధిక మరణాలు రోడ్డు ప్రమాదాల వల్లే చోటుచేసుకుంటున్నాయి. అయితే లాక్‌డౌన్‌లో రవాణాపై నిషేధం ఉన్నప్పటికీ అత్యధిక రహదారి ప్రమాదాలలో మరణిస్తుంది. లాక్‌డౌన్‌లో మరణాలు రేటు తగ్గినప్పటికీ దేశవ్యాపంగా జరిగిన 600 మరణాలల్లో 140 మరణాలు రోడ్డు ప్రమాదాలు ఉన్నాయి. అంటే మరణాలు నిష్పత్తిలో రోడ్డు ప్రమాద మరణాల రేటు ఎప్పటిలాగే ఉందని తమ నివేదిక ద్వారా వెల్లడైంది. ఈ లాక్‌డౌన్‌లోనే రోడ్ల ఇంజనీరింగ్ లోపాలను పరిష్కరించడానికి, ఎలక్ట్రానిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్స్టిట్యూట్స్, మెకానిజమ్‌ను పరిష్కరించడానికి వీలుగా ఉంటుంది. తద్వారా లాక్‌డౌన్ ముగిసిన తర్వాత రోడ్డు ప్రమాదాల రేటును తక్కువగా ఉంచవచ్చు, ”అని తివారీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment