ముంబై : మహారాష్ట్రలో ఇప్పటివరకూ 531 మంది పోలీసులకు కరోనా (కోవిడ్-19) పాజిటివ్‌గా నిర్ధారణ కాగా వారిలో 39 మంది కోలుకున్నారు. వీరిలో 51 మంది పోలీసు అధికారులున్నారని, 480 మంది కానిస్టేబుళ్లకు ఈ మహమ్మారి సోకిందని అధికారులు వెల్లడించారు. ప్రాణాంతక వైరస్ బారినపడి మరణించిన పోలీసుల సంఖ్య ఐదుకు పెరిగిందని చెప్పారు. దేశవ్యాప్త లాక్‌డౌన్ అమలైన అనంతరం మహారాష్ట్రలో 487 మందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలిందని అంతకుముందు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ట్వీట్ చేశారు.
ఇక లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై మొత్తం 96,231 కేసులు నమోదయ్యాయని చెప్పారు. లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి పోలీసులపై దాడులు, వేధింపుల ఘటనలు 189 చోటుచేసుకున్నాయని వెల్లడించారు. ఈ ఘటనలకు సంబంధించి 683 మందిని అరెస్ట్ చేశారని తెలిపారు. ఇదే సమయంలో మహారాష్ట్రలో 30 మంది ఆరోగ్య సిబ్బందిపైనా దాడులు జరిగాయని అధికారులు తెలిపారు. (చదవండి : షాకింగ్: కరోనా పేషెంట్ల పక్కనే శవాలు)
Comments
Please login to add a commentAdd a comment