
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు మరింత విజృంభిస్తోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6088 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,18,447కి చేరింది.కాగా 24 గంటల్లోనే 148 మంది మరణించడంతో దేశంలో మృతుల సంఖ్య 3583కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 48,533 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో 66,330 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా దేశంలో కరోనా రికవరీ రేటు 40.97 శాతంగా ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది.
(ఎందుకు.. ఏమిటి.. ఎలా?)
Comments
Please login to add a commentAdd a comment