ప్రాణం తీసిన గుర్రపు స్వారీ | 7-yr-old UK girl dies as horse runs amok | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన గుర్రపు స్వారీ

Published Thu, Apr 2 2015 2:07 PM | Last Updated on Sat, Sep 2 2017 11:45 PM

ప్రాణం తీసిన గుర్రపు స్వారీ

ప్రాణం తీసిన గుర్రపు స్వారీ

అలీబాగ్(మహారాష్ట్ర):  సరదాకి చేసిన గుర్రపు స్వారీ ఏడేళ్ల బ్రిటన్ బాలిక ప్రాణాలు తీసింది.  గుర్రంపై నుంచి పడి కళ్లముందే తమ కూతురు చనిపోతుంటే ఆ తల్లిదండ్రులు విలవిలలాడారు. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్కు చెందిన బాలిక ఇండియా మెవ్యూతన కుటుంబ సభ్యులతో కలసి అలీబాగ్లోని మధరాన్ హిల్ స్టేషన్లో మంగళవారం సాయంత్రం గుర్రంపై షికారును ఎంజాయ్ చేస్తోంది. ఒక్కసారిగా గుర్రం పిచ్చిపట్టినదానిలా ఎగురుతూ బాలికతో సహా అడవిలోకి పరుగుతీసింది.

ఈ క్రమంలో బాలిక గుర్రంపై నుంచి బ్యాలెన్స్ తప్పి కిందపడింది. అదే సమయంలో గుర్రానికి ఉన్న కల్లెంలో తన కాలు ఇరుక్కుపోవడంతో ఆ బాలికను గుర్రం దాదాపు 300 మీటర్లు ఈడ్చుకెళ్లింది. దీంతో ఆ బాలిక తలకు బలమైన గాయం కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే ప్రాణాలు కోల్పోయింది.  ఆ బాలిక తండ్రి గోవిన్ మార్క్ మెవ్యూ దుబాయ్లోని ఓ కపంఎనీలో పనిచేస్తున్నాడు. ముంబై వచ్చిన అతడు సరదాగా గడిపేందుకు కుటుంబంతో హిల్ స్టేషన్కు రాగా ఈ విషాధం చోటుచేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement