దీపావళి పండుగు ముందు రోజు తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా కర్మాగారంలో పేలుళ్లు సంభవించడంతో 8 మంది మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. శుక్రవారం కుంభకోణం వలుక్కచేరి బాణాసంచా కర్మాగారంలో కార్మికులు పనిచేస్తుండగా ఒక్కసారిగా ఈ దుర్ఘటన జరిగింది.
గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
తమిళనాడులో బాణాసంచా కర్మాగారంలో పేలుళ్లు, 8 మంది మృతి
Published Fri, Nov 1 2013 4:11 PM | Last Updated on Sat, Sep 2 2017 12:12 AM
Advertisement
Advertisement