Fire works factory
-
నిజామాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, నిజామాబాద్: నగర శివారులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ బాణాసంచా గోడౌన్లో మంటలు చెలరేగాయి. సంఘటన స్థలంలో ఎవరూ లేక పోవడంతో ప్రాణ నష్టం తప్పింది. మంటల్లో సత్యనారాయణ కో అండ్ కంపెనీ గోదాం పూర్తిగా కాలి బూడిదైంది. ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. -
రెండేళ్లైన ఇంకా ఆరని మంటలు!
సాక్షి, వరంగల్ రూరల్ : చెవులు చిల్లులు పడేలా శబ్దం, ఆకాశాన్ని అంటేలా కమ్ముకున్న పొగలు, మూడు కిలోమీటర్ల పరిధి వరకు కంపించిన ఇళ్లు, కూలిపోయిన గోడలు, వందల మీటర్ల దూరం వరకు ఎగిరిపడిన కార్మికుల శరీర భాగాలు.. ఇదీ వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి ఫైర్ వర్క్స్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఘటన నాటి పరిస్థితి. రెండేళ్ల క్రితం అంటే 2018 జూలై 4న ఉదయం 11 గంటల సమయంలో జరిగిన బాంబుల పేలుళ్ల ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిబంధనలు తుంగలోకి తొక్కి అధికారుల కళ్లు కప్పి నడుస్తున్న ఫైర్వర్క్స్లో జరిగిన ప్రమాదం పది నిండు ప్రాణాలను బలి తీసుకోగా మరో ఐదుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. టపాసుల తయారీ, విక్రయం.. వరంగల్ నగరానికి చెందిన గొల్లపల్లి కుమార్(బాంబుల కుమార్) కాశిబుగ్గ సమీపంలో కోటిలింగాల వద్ద భద్రకాళి ఫైర్వర్క్స్ పేరుతో టపాసుల తయారీ, విక్రయాలు చేశారు. ఈ వర్క్‌షాప్‌లో రెండేళ్ల క్రితం జరిగిన పేలుళ్ల ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఐదురుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగి రెండేళ్లు అవుతున్నా బాధిత కుటుంబాలు ఇంకా తేరుకోలేదు. ఆ కుటుంబాలను కదిలిస్తే కన్నీరు మున్నీరవుతున్నారు. పరిహారం పెండింగ్‌లోనే.. ఎంప్లాయిస్ కంపర్‌జేషన్ యాక్ట్ 1932 ప్రకారం కంపెనీలో పని చేస్తున్న వారికి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఒకేసారి పది మంది మరణించడంతో కార్మిక శాఖ ఈ కేసును సుమోటగా స్వీకరించి జైలులో ఉన్న భద్రకాళి ఫైర్ వర్క్స్ యజమాని బాంబుల కుమార్‌కు 2018 జూలై 20న నోటీసులు పంపించారు. అయినా స్పందన లేకపోవడంతో కార్మిక శాఖే బాధితుల్లో ఒక్కొక్కరికి రూ.6 లక్షల నుంచి రూ.9లక్షల వరకు మొత్తం రూ.68లక్షలు పరిహారం చెల్లించాలని ఆర్డర్ జారీ చేసింది. ఈ నగదును 30 రోజుల్లో డిపాజిట్ చేయాలని ఆదేశించగా.. భద్రకాళి ఫైర్ వర్క్స్‌ను 2016లోనే తన బావమరిది, ఈ ఘటనలో చనిపోయిన రఘుపతికి అప్పగించానని కుమార్ సమాధానం ఇచ్చారు. ఈ సమాధానాన్ని డిస్మిస్ చేస్తూ బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాల్సిందేనని కార్మికశాఖ మరో ఆర్డర్ జారీ చేసింది. అయితే, పరిహారం చెల్లించకుండా తప్పించుకునేందుకే చనిపోయిన తన బావమరిదికి వర్క్‌షాప్ అప్పగించానని చెప్పినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత కార్మిక శాఖ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా కార్మిక శాఖ ఇచ్చిన ఆదేశాల ప్రకారం నష్టపరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు వెలువడింది. దీంతో రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం యజమాని ఆస్తులను జప్తు చేసి చనిపోయిన కార్మిక కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ను కార్మిక శాఖ కోరింది. అయితే, ఇది ఇంకా పెండింగ్‌లోనే ఉండడంతో బాధిత కుటుంబాలు ఎదురుచూస్తున్నారు. అంతా కూలీలే.. ఆ రోజు బాంబుల తయారీ కోసం 14 మంది కూలీలు వర్క్‌షాప్‌కు వచ్చారు. అక్కడ జరిగిన పేలుడులో కాశిబుగ్గ తిలక్ రోడ్డుకు చెందిన గాజుల హరికృష్ణ(38), సుందరయ్య నగర్ ఓంసాయి కాలనీకి చెందిన కోమటి శ్రావణి(33), బేతి శ్రీవాణి(25), ఏనుమాముల మార్కెట్ రోడ్ బాలాజీ నగర్‌కు చెందిన రంగు వినోద్(24), కాశిబుగ్గకు చెందిన వల్దాసు అశోక్‌కుమార్ (30), కాశిబుగ్గ సాయిబాబా గుడి సమీపానికి చెందిన బాలిని రఘుపతి(40), కీర్తి నగర్ కాలనీకి చెందిన కందకట్ల శ్రీదేవి(34), సుందరయ్య నగర్‌కు చెందిన బాస్కుల రేణుక(39), కొత్తవాడకు చెందిన వడ్నాల మల్లికార్జున్(35), కరీమాబాద్‌కు చెందిన వంగరి రాకేష్ (22) అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. వీరిలో మల్లికార్జున్, రాకేష్ మృతుదేహాలు గుర్తు పట్టలేని విధంగా చిధ్రం కావడంతో డీఎన్ఏ పరీక్ష చేయించాల్సి వచ్చింది. ఇక బాలాజీనగర్‌కు చెందిన కొండపల్లి సురేష్, గొర్రెకుంటకు చెందిన బందెల సారంగపాణి, కాశిబుగ్గకు చెందిన పరికెరాల మోహన్, హన్మకొండకు చెందిన బాతింగ్ రవి, కోటిలింగాలగుడి సమీపంలోని సైలేంద్ర శివ తీవ్రంగా గాయపడ్డారు. అలాగే, పేలుడు ఘటనతో ఫైర్ వర్క్స్ చుట్టుపక్కల సమారు 300 మీటర్ల దూరం వరకు ఉన్న గృహాల పైకప్పు రేకులు పగిలిపోయాయి. కొందరు మరమ్మతులు చేసుకుని ఉంటుండగా, మరికొందరు ఆ ఇళ్లను వదిలేశారు. -
సలుపుతున్న గాయం
సాక్షి, వరంగల్ రూరల్: చెవులు చిల్లులు పడేలా శబ్ధం, ఆకాశాన్ని అంటేలా కమ్ముకున్న పొగలు, మూడు కిలోమీటర్ల వరకు కంపించిన ఇళ్లు, వంగిపోయిన స్టీలు కడ్డీలు, కూలిపోయిన గోడలు, తునాతునకలైన షాబాదు రాళ్లు, వందల మీటర్ల దూరం వరకు ఎగిరిపడి ఛిధ్రమైన కార్మికుల శరీర భాగాలు... ఇవీ వరంగల్‌లోని శ్రీ భద్రకాళీ ఫైర్వర్క్స్లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు కనిపించిన ఆనవాళ్లు. సరిగ్గా ఏడాది క్రితం అంటే 4 జూలై 2018న ఉదయం 11 గంటల సమయంలో జరిగిన బాంబుల పేలుళ్లు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిబంధనలు తుంగలో తొక్కి అధికారుల కళ్లు నిర్వహిస్తున్న ఫైర్వర్క్స్లో ప్రమాదం జరిగిన పది మంది మృతి చెందగా.. మరో మరో ఐదుగురికి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి రాష్ట్రప్రభుత్వం నుంచి తప్ప యజమాని నుంచి ఎలాంటి సాయం అందకపోగా.. గాయపడిన వారు జీవచ్ఛవాల్లా కాలం వెళ్లదీస్తున్నారు. సజీవ దహనం వరంగల్‌కు చెందిన కుమార్(బాంబుల కుమార్) కాశిబుగ్గ సమీపంలో కోటిలింగాల వద్ద భద్రకాళి ఫైర్వర్క్స్ పేరుతో టపాసుల తయారీ పరిశ్రమ ఏర్పాటుచేశారు. అక్కడ సరైన రక్షణ ఏర్పాట్లు లేక.. నిబంధనలు పాటించని కారణంగా జరిగిన ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే ఘటనలో మరో ఐదురుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగి ఏడాది అవుతున్నా బాధిత కుటుంబాలు ఇంకా దానిని మరిచిపోలేదు. ఎవరిని కదిలించినా కన్నీరు మున్నీరవుతున్నారు. కాగా, ఆ రోజు బాంబుల తయారీ కోసం 14 మంది కూలీలు వచ్చారు. ప్రమాదంలో కాశిబుగ్గ తిలక్ రోడ్‌కు చెందిన గాజుల హరికృష్ణ(38), సుందరయ్య నగర్ ఓంసాయి కాలనీకి చెందిన కోమటి శ్రావణి(33), బేతి శ్రీవాణి(25), ఏనుమాముల మార్కెట్ రోడ్ బాలాజీనగర్‌కు చెందిన రంగు వినోద్(24), కాశిబుగ్గకు చెందిన వల్దాసు అశోక్‌కుమార్(30), కాశిబుగ్గ సాయిబాబా గుడి సమీపానికి చెందిన బాలిని రఘుపతి(40) మృతి చెందారు. వీరితో పాటు కీర్తి నగర్ కాలనీకి చెందిన కందకట్ల శ్రీదేవి(34), సుందరయ్య నగర్‌కు చెందిన బాస్కుల రేణుక(39), కొత్తవాడకు చెందిన వడ్నాల మల్లికార్జున్ (35), కరీమాబాద్‌కు చెందిన వంగరి రాకేష్(22) మృత్యువాతపడ్డారు. కాగా, ఇద్దరి శరీరాలు గుర్తుపట్టలేకుండా చిధ్రం కావడంతో డీఎన్ఏ టెస్ట్ తర్వాత మల్లికార్జున్, రాకేష్ మృతుదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అందించారు. ఇంకా బాలాజీనగర్‌కు చెందిన కొండపల్లి సురేష్, గొర్రెకుంటలకు చెందిన బందెల సారంగపాణి, కాశిబుగ్గకు పరికెరాల మోహన్, హన్మకొండకు చెందిన బాతింగ్ రవి, కోటిలింగాలగుడి సమీపంలోని సైలేంద్ర శివ గాయపడ్డారు. ఫైర్ వర్క్స్ చుట్టుప్రక్కల సమారు 300 మీటర్ల దురం వరకు ఉన్న గృహాల పైకప్పు రేకులు పగిపోయాయి. కొందరు మరమ్మత్తులు చేసుకుని ఉంటున్నారు. మరికొందరు ఆ గృహాలను వదిలేశారు. తప్పించుకునే ప్రయత్నం ఎంప్లాయిస్ కంపర్‌జేషన్ యాక్ట్ 1932 ప్రకారం ఒక కంపెనీలో పని చేస్తున్న వారికి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఒకేసారి 10 మంది మరణించడంతో కార్మిక శాఖ ఈ కేసును సుమోటగా స్వీకరించింది. దీంతో 2018 జూలై 20న జైలులో ఉన్న భద్రకాళి ఫైర్ వర్క్స్ యజమాని బాంబుల కుమార్‌కు నోటీసులు పంపించారు. అయినా స్పందన రాకపోవడంతో ఒక్కొక్కరికి రూ.6 నుంచి రూ.9లక్షల వరకు చొప్పున రూ.68లక్షలు చెల్లించాలని ఆర్డర్ జారీ చేశారు. ఈ నగదును 30 రోజుల్లో డిపాజిట్ చేయాలని ఆదేశించగా.. 2016లోనే పరిశ్రమను తన బావమరిది రఘుపతికి అప్పగించానని కుమార్ సమాధానం ఇచ్చారు. కాగా, రఘుపతి కూడా ఈ ఘటనలో కన్నుమూసిన నేపథ్యంలో తప్పించుకునేందుకు ఇలా చెప్పాడని భావించిన కార్మిక శాఖ బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పింది. అయితే, కార్మిక శాఖ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తు హైకోర్టును ఆశ్రయించడంతో యజమాని నుంచి నష్టపరిహారం ఇంకా అందలేదు. కానిస్టేబుల్ అవుదామనుకున్నాడు పై ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు కొండపల్లి సురేష్. కానిస్టేబుల్ కావాలనుకున్నాడు... బాంబుల పేలుళ్ల ఘటన బెడ్‌కే పరిమితం చేసింది. బాలాజీనగర్‌కు చెందిన ఈయన బాంబుల కుమార్ దగ్గర పని చేస్తున్నాడు. పేపర్ షార్ట్‌లు తయారు చేస్తుండగా పేలుళ్లు సంభవించాయి. బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఎడుమ కాలుపై బాంబు పడటంతో తెగిపోయింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సురేష్ ను 108 ద్వారా ఎంజీఎం తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యం ఖర్చులు ప్రభుత్వమే చెల్లించింది. అయినా ఇంట్లో బంగారం అమ్మాల్సి వచ్చింది. ఇక సెప్టెంబర్ 20వ తేదీన నిమ్స్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇంట్లోనే బెడ్‌కే పరిమితం అయ్యారు. తండ్రి జంపయ్య ఆరోగ్యం సరిగా లేకపోవడంతో పనికి వెళ్లడం సైతం బంద్ చేశారు. తల్లితండ్రుల వయస్సు భారంతో ఇంట్లోనే ఉంటున్నారు. సురేష్‌కు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని తల్లితండ్రులు కోరుతున్నారు. నిర్లక్ష్యంతోనే ప్రమాదం ఫైర్ వర్క్స్‌లో కనీస నిబంధనలు పాటించని కారణంగా ప్రమాదం జరిగిందని వివిధ శాఖల వారు తెల్చారు. ఈ మేరకు నివేదికలు కూడా ఇచ్చారు. బాంబుల తయారికి ఉపయోగించే ముడి పదార్థం ఒకే దగ్గర ఎక్కువ మొత్తంలో నిల్వ పెట్టడం వలనే ఈ పెనుప్రమాదం జరిగినట్లు గుర్తించారు. నన్ను ఒంటరిని చేసి పోయింది బాంబుల తయారీ కంపెనీలో పనికి నా భార్య రేణుక రోజులాగే వెళ్లింది. బాంబుల పేలుళ్ల ఘటనలో చనిపోయింది. నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయింది. నాకు ఇద్దరు కుమార్తెలు. ఒకరి పెళ్లి ఇటీవలే చేశాను. నాకు వయస్సు మీద పడటంతో ఇంట్లోనే ఉంటున్నాను. కేసీఆర్ ప్రకటించిన రూ.5లక్షలు మాత్రమే వచ్చాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన యజమానిని కఠినంగా శిక్షించాలి. – బాస్కుల కొమురయ్య, సుందరయ్యనగర్ ఇబ్బంది పడుతున్నాం బాంబుల పెలుళ్లలలో నా భార్య శ్రావణి, చెల్లె శ్రీవాణి ఇద్దరు చనిపోయారు. నాకు ముగ్గురు ఆడ పిల్లలు, చెల్లెకు ఇద్దరు ఆడ పిల్లలు న్నారు. పిల్లలకు తల్లులు లేని అనాథులగా మారారు. పిల్లలల బాగోగులు చూసుకునేందుకు పనికి కూడా సరిగా వెళ్లడం లేదు. పిల్లలు స్థానిక ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నాను. పిల్లలను గురుకులల్లో జాయిన్ చేయిస్తామని చెప్పిన అధికారులు ప్రస్తుతం పట్టించుకోవడంలేదు. నా పిల్లలకు తల్లి లేకుండా చేసిన యజమానిని శిక్షించి మమ్ముల్ని ఆదుకోవాలి. – కోమటి రాజు, కోటిలింగాల గుడి దగ్గర -
బాణసంచా గోదాములో భారీ పేలుళ్లు;8మంది సజీవ దహనం
-
వరంగల్‌లో భారీ అగ్నిప్రమాదం
-
భద్రకాళి ఫైర్ వర్క్స్‌లో అగ్నిప్రమాదం
-
వరంగల్ విషాదంపై స్పందించిన కేసీఆర్
సాక్షి, వరంగల్ అర్బన్ : వరంగల్‌లో దారుణం చోటుచేసుకుంది. బాణాసంచా తయారీ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంలో పది మంది సజీవ దహనం అయ్యారు. ఈ విషాదం భద్రకాళి ఫైర్ వర్క్స్‌లో బుధవారం జరిగింది. భద్రకాళి ఫైర్ వర్క్స్ గోదాములో ఒక్కచోటు చిన్నగా నిప్పురాజుకోవడంతో బాణాసంచా కాలడం మొదలైంది. కొన్ని క్షణాల్లోనే పెద్ద ఎత్తున బాణాసంచా దగ్దం కావడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో గోదాముల పనిచేస్తున్న కార్మికులను రక్షించేందుకు వీలులేక పోవడంతో పది మంది అగ్నికీలలకు ఆహుతయ్యారు. వరంగల్ అగ్ని ప్రమాదం ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కేసీఆర్ అదేశించారు. కాగా, కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈ విషాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రెండు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది విశ్వప్రయత్నాలు చేసి మంటల్ని అదుపులోకి తెచ్చాయి. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మృతుల కుటుంబీకులు బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. 8 మంది కార్మికులు సురక్షితం అగ్నికీలల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులను అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. అయితే అయిదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి కార్మికుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడటంతో కుటుంబసభ్యులు మృతదేహాల పక్కన ఉండేందుకు భయపడ్డారు. గోదాంలో పరిమితికి మించి మందుగుండు సామాగ్రిని నిల్వ ఉంచడమే ప్రమాదానికి కారణమని సమాచారం. -
తమిళనాడులో బాణాసంచా కర్మాగారంలో పేలుళ్లు, 8 మంది మృతి
దీపావళి పండుగు ముందు రోజు తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా కర్మాగారంలో పేలుళ్లు సంభవించడంతో 8 మంది మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. శుక్రవారం కుంభకోణం వలుక్కచేరి బాణాసంచా కర్మాగారంలో కార్మికులు పనిచేస్తుండగా ఒక్కసారిగా ఈ దుర్ఘటన జరిగింది. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.