విద్యార్థులను చిదిమేసిన బొలెరో | 9 Dead, 20 Injured After Speeding SUV Runs Over School Children In Bihar | Sakshi
Sakshi News home page

విద్యార్థులను చిదిమేసిన బొలెరో

Published Sun, Feb 25 2018 2:58 AM | Last Updated on Sun, Feb 25 2018 9:35 AM

9 Dead, 20 Injured After Speeding SUV Runs Over School Children In Bihar - Sakshi

ప్రమాదానికి కారణమైన బొలెరో వాహనం

ముజఫర్‌పూర్‌(బిహార్‌): రోజూలాగే స్కూల్‌ నుంచి ఇంటికి బయలుదేరిన విద్యార్థులపైకి బొలెరో వాహనం మృత్యువుగా దూసుకొచ్చింది. విద్యార్థులు రోడ్డు దాటుతుండగా జరిగిన ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతిచెందగా, 20 మంది గాయపడ్డారు. హృదయ విదారకమైన ఈ సంఘటన బిహార్‌లోని మిణాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం చోటు చేసుకుంది.

మధ్యాహ్నం స్కూల్‌ వదిలిపెట్టాక ఇంటికి బయలుదేరిన విద్యార్థులపైకి బొలెరో అదుపుతప్పి దూసుకొచ్చిందని ముజఫర్‌పూర్‌ ఎస్పీ వివేక్‌ కుమార్‌ తెలిపారు. దీంతో 9మంది విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారన్నారు. ప్రమాదంతో ఆ ప్రాంతం రక్తసిక్తంగా మారిందని చెప్పారు. గాయపడిన 20 మందిని చికిత్స కోసం శ్రీ కృష్ణా మెడికల్‌ హాస్పిటల్‌కు తరలించామని, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement