మన పార్టీలో చాలామంది కీచకులు: ఎమ్మెల్యే లేఖాస్త్రం | aam admi party mla writes letter to kejriwal about debauchery in party | Sakshi
Sakshi News home page

మన పార్టీలో చాలామంది కీచకులు: ఎమ్మెల్యే లేఖాస్త్రం

Published Mon, Sep 5 2016 8:13 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM

మన పార్టీలో చాలామంది కీచకులు: ఎమ్మెల్యే లేఖాస్త్రం - Sakshi

మన పార్టీలో చాలామంది కీచకులు: ఎమ్మెల్యే లేఖాస్త్రం

ఆమ్ ఆద్మీ పార్టీలో ఇంకా చాలామంది కీచకులు ఉన్నారట. తనపై మాజీ మంత్రి సందీప్ కుమార్ అత్యాచారం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేయడం, ఆయనను పోలీసులు అరెస్టు చేయడం వంటి పరిణామాలు జరిగిన తర్వాత.. అదే పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే తమ పార్టీలోని కీచకుల విషయాన్ని బయటపెట్టారు. అత్యవసరంగా నిజనిర్ధారణ కమిటీ ఒకదాన్ని నియమించి దాన్ని పంజాబ్‌కు పంపాలని ఆయన కోరారు. బిజ్వాసన్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవీందర్ షెరావత్ ఈ విషయమై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. ఢిల్లీతో పాటు పంజాబ్‌లో ఉన్న పార్టీ సీనియర్ నాయకులు మహిళలను వాడుకుంటున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని నిరూపించడానికి తన వద్ద ఆధారాలు మాత్రం ఏమీ లేవన్నారు.

ఎన్నికల్లో టికెట్ ఇప్పిస్తామంటూ మహిళలను లైంగికంగా దోచుకుంటున్నారని, పంజాబ్‌లో పార్టీ పెద్దలుగా చలామణి అవుతున్నవాళ్లు ఏం చేస్తున్నారో ఢిల్లీ ఎమ్మెల్యేలకు తెలియదని షెరావత్ చెప్పారు. ఢిల్లీలో ఉండే ఓ పెద్దమనిషి అమ్మాయిలతో ఉన్న ఫొటోలు తరచు ఇంటర్‌నెట్‌లో కనిపిస్తున్నాయని, పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ప్రతినిధి అశుతోష్ ఈ వ్యవహారాలను సమర్థించుకుంటున్నా... అవి నైతిక విలువల ప్రకారం ఆమోదయోగ్యం కాదని అన్నారు. కొందరు మంత్రులపైన, ముఖ్యమైన పదవుల్లో ఉన్నవారిపైన కూడా వ్యభిచారం ఆరోపణలు వస్తున్నాయని, నియోజకవర్గంలో  ఓటర్లు తనను ప్రశ్నిస్తున్నారని తెలిపారు.

అయితే ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం షెరావత్ లేఖను ఏమాత్రం పట్టించుకోలేదు. అతడు కేవలం ఓ అసంతృప్త ఎమ్మెల్యే అని.. అతడి ఆరోపణలకు ఏమాత్రం ఆధారాలు లేవని పార్టీ ఢిల్లీ కన్వీనర్ దిలీప్ పాండే అన్నారు. ఆధారాలు లేని ఆరోపణలకు తాము స్పందించబోమని చెప్పారు. అతడు కావాలనుకుంటే పార్టీ వేదికపై చెప్పాలి గానీ, ఇలాంటి విషయాలపై బహిరంగంగా మాట్లాడకూడదని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement