న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) దేశంలోని ఇతర పార్టీలకు ఆదర్శంగా నిలిచే నిర్ణయాన్ని తీసుకుంది. పార్టీలో అంతర్గతంగా నమోదయ్యే లైంగిక వేధింపుల ఫిర్యాదులను విచారించేందుకు ముగ్గురు మహిళలతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఆప్ నేతలు అతిషి మర్లేనా, ప్రీతిశర్మతోపాటు సామాజిక కార్యకర్త లీలారామ్‌దాస్ సభ్యులుగా ఉంటారని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు దిలీప్‌పాండే సోమవారం తెలిపారు. విశాఖ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా లైంగిక వేధింపులపై విచారణకు కమిటీని నియమించిన తొలి రాజకీయ పార్టీగా ఆప్ నిలిచిపోతుంది.