కేరళ సీఎం ఆయనే!
కేరళలో హోరాహోరీగా సాగుతాయనుకున్న ఎన్నికలు ఫలితాలు వామపక్షాల వైపే నిలిచాయి. ఇక మిగిలింది రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు పగ్గాలు చేపడతారన్న విషయమే. ఇప్పటికే సీపీఐ నుంచి ఇద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఒకరు వీఎస్ అచ్యుతానందన్ కాగా మరొకరు పినరయి విజయన్. ప్రస్తుతం కేరళ ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ నేత ఊమెన్ చాందీ శుక్రవారం ఉదయం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు.
దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించడానికి సీపీఐ శుక్రవారం ఉదయమే సమావేశమైంది. 93 ఏళ్ల అచ్యుతానందన్ ను సీఎంగా ఎన్నుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సీపీఐకి చెందిన ఓ సీనియర్ నేత తెలిపారు. అయితే ఈయనకు విజయన్ కూడా గట్టి పోటీయే ఇస్తున్నారు. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్ డీఎఫ్) 91 స్థానాల్లో గెలుపొందింది.