న్యూఢిల్లీ: భూసేకరణ ఆర్డినెన్స్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దీనిపై రైతుల సలహాలు సేకరించేందుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం ఎనిమిది మందితో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. కేంద్ర మాజీ మంత్రి సత్యపాల్ మాలిక్ కన్వీనర్‌గా ఉండే ఈ కమిటీ... రైతులు, వివిధ సంఘాలతో సమావేశమై భూసేకరణపై వారి సలహాలు, సూచనలను స్వీకరిస్తుంది.
కమిటీలో మాలిక్‌తోపాటు పార్టీ ఎంపీలు భూపేందర్ యాదవ్, రాం నారాయణ్ దుడి, హుకం దేవ్‌నారాయణ్, రాకేశ్‌సింగ్, సంజయ్ దోత్రి, సురేశ్ అంగాడి సభ్యులుగా ఉంటారు. చార్టెడ్ అకౌంటెంట్ గోపాల్ అగర్వాల్‌ను కూడా కమిటీలో చేర్చారు.
‘భూసేకరణ’పై బీజేపీ కమిటీ
Published Wed, Feb 25 2015 3:18 AM | Last Updated on Wed, Apr 3 2019 8:42 PM
Advertisement
Advertisement