
భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ (ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ : ‘అల్లా తర్వాత మీపైనే ఆశలు పెట్టుకున్నాం. మాకు మీరే దారి చూపాలి. ఎంబసీ ద్వారా మెడికల్ వీసా సదుపాయం కల్పించండి. మా సోదరుడికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్ చేయించాలి’ అంటూ పాకిస్తాన్‌కి చెందిన షాజైబ్ ఇక్బాల్ భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను ట్విటర్ ద్వారా అభ్యర్థించారు.
దీనిపై వెంటనే స్పందించిన సుష్మా.. ‘భారత్ మీ ఆశలుపై నీళ్లు చల్లదు. మేం మీకు వెంటనే వీసా జారీ చేస్తున్నాం.’ అని పోస్టు చేశారు. బాధితుడి కుటుంబంలోని నలుగురికి వెంటనే భారత్ వచ్చేందుకు మెడికల్ వీసా సదుపాయం కల్పించాలని పాకిస్తాన్‌లోని భారత హైకమిషన్‌ను ఆదేశించారు.
కాగా, మానవీయ కోణంలో చూడాల్సిన అంశాలను కూడా భారత్ రాజకీయ కోణంలో చూస్తోందని పాక్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పాకిస్తానీయులకు మెడికల్ వీసాలు జారీ చేస్తామని భారత్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment