సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియా వేదికగా తక్షణ సాయం అందించే భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇండియాలో వైద్యం కోసం ఆర్జీ పెట్టుకున్న పాక్ ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయం ఆమె ప్రకటించారు. పెండింగ్‌లో ఉన్న వారందరికీ మెడికల్ వీసాలు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ ఉదయం ట్విట్టర్ లో ఆమె ఈ విషయం తెలిపారు. అర్హులైన వారందరికీ తక్షణమే వీసాలు మంజూరు చేస్తున్నట్లు ఆమె ట్వీట్ లో తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా పాక్ ప్రజలకు వీసా జారీచేయటం చాలా క్లిష్ణమైన సమస్యగా విదేశాంగ శాఖ భావిస్తుంటుంది. కానీ, సుష్మా చొరవతో అది చాలా సులభతరంగా మారింది. ఆ మధ్య కంటి కేన్సర్‌తో బాధపడుతున్న ఓ చిన్నారికి, ఎముకల సమస్యతో బాధపడుతున్న ఓ వ్యక్తికి, కాలేయ సమస్యలతో బాధపడుతున్న మరో ఇద్దరికి మెడికల్ వీసాలు జారీ చేయాలని పాకిస్థాన్‌లోని భారత హై కమిషన్‌ను ఆమె ఆదేశించిన విషయం తెలిసిందే.
అంతేకాకుండా ట్విట్టర్ ద్వారా ఆమె దృష్టికి వచ్చిన అన్ని రకాల సమస్యలను ఆమె పరిష్కరిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.
On the auspicious occasion of Deepawali, India will grant medical Visa in all deserving cases pending today. @IndiainPakistan
— Sushma Swaraj (@SushmaSwaraj) October 19, 2017
Comments
Please login to add a commentAdd a comment