
'జయలలిత త్వరగా కోలుకోవాలి'
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రిని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బుధవారం సందర్శించారు. జయలలిత ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇరువురు నేతలు 20 నిమిషాల పాటు ఆస్పత్రిలో గడిపారు. తర్వాత మీడియాతో మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
జయలలిత ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు చెన్నై అపోలో ఆస్పత్రికి వెళ్లామని ట్విట్టర్ ద్వారా వారు తెలిపారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న జయలలిత 20 రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సెప్టెంబర్ 22న ఆమె ఆస్పత్రిలో చేరారు. బ్రిటన్, ఢిల్లీ ఎయిమ్స్ వైద్య బృందం పర్యవేక్షణలో ఆమెకు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు.
Visited Apollo hospital Chennai today. I wish J Jayalalithaa Ji, Chief Minister of Tamil Nadu a speedy recovery.
— Arun Jaitley (@arunjaitley) 12 October 2016
Visited Apollo Hospital in Chennai to enquire about the health of Tamil Nadu CM J Jayalalithaa Ji. I wish and pray for her speedy recovery.
— Amit Shah (@AmitShah) 12 October 2016