సాక్షి, న్యూఢిల్లీ: అనారోగ్యంతో ఎయిమ్స్‌లో కన్నుమూసిన కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ భౌతికకాయానికి ప్రముఖులు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు హర్షవర్థన్, జైశంకర్ తదితరులు కైలాశ్ కాలనీలోని జైట్లీ నివాసానికి తరలి వచ్చి... ఆయన పార్థివదేహానికి అంజలి ఘటించారు. అరుణ్ జైట్లీ కుటుంబసభ్యులను పరామర్శించారు.
చదవండి: అరుణ్ జైట్లీ అస్తమయం
అలాగే కాంగ్రెస్ నేత జ‍్యోతిరాధిత్య సింధియా, ఆయన కుటుంబసభ్యులు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా శనివారం సాయంత్రం జైట్లీ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కాగా అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న అరుణ్ జైట్లీ ఇవాళ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం జరుగుతాయి. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ విదేశీ (యూఏఈ) పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. జైట్లీ మరణవార్త తెలియగానే కుటుంబసభ్యులను ...ప్రధాని ఫోన్‌లో పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment