ట్రంప్‌ టూర్‌ : మురికివాడలు ఖాళీ | Ahead Of Donald Trump Visit Eviction Notice Served To Slum Dwellers in Motera | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ టూర్‌ : మురికివాడలు ఖాళీ

Published Tue, Feb 18 2020 3:37 PM | Last Updated on Mon, Feb 24 2020 2:08 PM

Ahead Of Donald Trump Visit Eviction Notice Served To Slum Dwellers in Motera - Sakshi

గాంధీనగర్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అహ్మదాబాద్‌ పర్యటన నేపథ్యంలో పేదల ఇళ్లు కనిపించకుండా గోడ నిర్మాణం చేపట్టడం విమర్శల పాలవగా తాజాగా మొతెరా ప్రాంతంలో మురికివాడల నుంచి ప్రజలను ఖాళీ చేయించేందుకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసేందుకు అక్కడి పేదలకు 7 రోజుల ముందు నోటీసులు జారీ చేశారు. మరోవైపు ట్రంప్‌ పర్యటనకు ఏర్పాట్లను పరిశీలించేందుకు గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ మొతెరా స్టేడియాన్ని సందర్శించారు.

ట్రంప్‌ పర్యటనకు భద్రతా ఏర్పాట్లను ఈ సందర్భంగా సీఎం అధికారులతో సమీక్షించారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంలో నమస్తే ట్రంప్‌ కార్యక్రమం జరుగుతుండటంతో గుజరాత్‌ ప్రభుత్వం ఈ ఈవెంట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఈనెల 24న వాషింగ్టన్‌ నుంచి నేరుగా అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. విమానాశ్రయంలో ట్రంప్‌నకు ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ సహా ఇతర ప్రముఖులు స్వాగతం పలుకుతారు.

చదవండి : ట్రంప్‌ సాక్షిగా గోడకు అటూ ఇటూ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement