slum dwellers
-
ఆకలితో ఎవరూ బాధపడ కూడదు
ఈ కరోనా కష్టకాలంలో వలస కార్మికులు, దినసరి కూలీల కష్టాలను తీర్చేందుకు మన వంతు సాయం చేయాలంటున్నారు తమన్నా. తన వంతుగా ముంబై మురికివాడల్లోని దాదాపు పదివేల మంది వలస కార్మికులు, దినసరి కూలీలకు ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి ఆహారాన్ని అందిస్తున్నట్లుగా చెబుతున్నారు తమన్నా. ‘‘ఈ కరోనా మహమ్మారి కారణంగా లక్షల మంది జీవితాలు ఊహించని విధంగా దెబ్బతిన్నాయి. వ్యాక్సిన్ దొరికే వరకు సామాజిక దూరం, దేశవ్యాప్త లాక్డౌన్ విధివిధానాలను పాటించడమే కరోనా నిర్మూలనకు సరైన మార్గాలు. ప్రస్తుతం మనందరి జీవితాలపై కరోనా ప్రభావం చాలా ఉంది. తిరిగి మనందరి జీవితాలు సరైన మార్గంలోకి రావడానికి వారాలు లేదా కొన్ని నెలలు కూడా పట్టొచ్చు. ముఖ్యంగా వలస కార్మికులు, దినసరి కూలీలు ఈ కష్టకాలంలో జీవనపోరాటం చేస్తున్నారు. వారిని వారు పోషించుకోవడమే వారికి పెద్ద సవాల్‌గా మారింది. అలాంటివారు ఆకలితో బాధ పడకూడదని ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి నా వంతుగా నేను సాయం చేస్తున్నాను. మనందరం ఆ కష్టజీవులకు అండగా ఉండాల్సిన సమయం ఇది’’ అని పేర్కొన్నారు తమన్నా. -
ట్రంప్ టూర్ : మురికివాడలు ఖాళీ
-
ట్రంప్ టూర్ : మురికివాడలు ఖాళీ
గాంధీనగర్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ పర్యటన నేపథ్యంలో పేదల ఇళ్లు కనిపించకుండా గోడ నిర్మాణం చేపట్టడం విమర్శల పాలవగా తాజాగా మొతెరా ప్రాంతంలో మురికివాడల నుంచి ప్రజలను ఖాళీ చేయించేందుకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసేందుకు అక్కడి పేదలకు 7 రోజుల ముందు నోటీసులు జారీ చేశారు. మరోవైపు ట్రంప్ పర్యటనకు ఏర్పాట్లను పరిశీలించేందుకు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ మొతెరా స్టేడియాన్ని సందర్శించారు. ట్రంప్ పర్యటనకు భద్రతా ఏర్పాట్లను ఈ సందర్భంగా సీఎం అధికారులతో సమీక్షించారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమం జరుగుతుండటంతో గుజరాత్ ప్రభుత్వం ఈ ఈవెంట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈనెల 24న వాషింగ్టన్ నుంచి నేరుగా అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. విమానాశ్రయంలో ట్రంప్‌నకు ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ సహా ఇతర ప్రముఖులు స్వాగతం పలుకుతారు. చదవండి : ట్రంప్ సాక్షిగా గోడకు అటూ ఇటూ! -
సమోసా ఇచ్చి.. మతం మారాలన్నారు!
సాక్షి, లక్నో: బస్తీలో నివసించే కొందరికి సమోసాలు ఇచ్చి, క్రైస్తవమతంలోకి మార్పించే యత్నం చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఆగ్రాలోని జగదీశ్ పురలో మూడురోజుల కిందట జరిగిన దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. జగదీశ్ పురలోని సెక్టార్-4 వికాస్ కాలనీలో మురికివాడల్లో కొందరు నివాసం ఉంటున్నాం. గురువారం రోజు కొందరు క్రైస్తవమత ప్రచారకులు మా వద్దకు వచ్చారు. వారిలో ఓ పాస్టర్, నలుగురు సిస్టర్స్ ఉన్నారు. మొదట మమ్మల్ని కలిసిన వెంటనే వారు మాకు, మా పిల్లలకు సమోసాలు పంచిపెట్టారు. సమోసాలు తింటుంటూ క్రైస్తవ మతంలోకి మారాలంటూ సూచించారు. తాము ఆశ్చర్యపోయి చూస్తుంటే మీరే ఆందోళన చెందొద్దు.. మీకు ఎన్నో వసతులు కల్పిస్తాం. మీ పిల్లలకు చదువు చెప్పిస్తామని ఆ పాస్టర్, సిస్టర్స్ చెప్పారు. అదే సమయంలో ఓ వ్యక్తి ఏం జరుగుతుందని ప్రశ్నించాడు. పోలీసులకు సమాచారం అందించాడు. ఆ వెంటనే పాస్టర్ తన దుస్తులు మార్చుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారని మాయా అనే స్థానికురాలు తెలిపారు. ఆగ్రా ఎస్పీ సన్వార్ అనుపమ్ సింగ్ మాట్లాడుతూ.. ఓ సంస్థ నుంచి ఫిర్యాదు అందగా విచారణ చేపట్టాం. చిన్నారుల విద్య గురించి బస్తీ వారికి అవగాహన కల్పించడానికి మహిళా దినోత్సవరం రోజు వెళ్లినట్లు క్రైస్తవ మిషనరీ పేర్కొంది. అవగాహన కల్పించి అక్కడినుంచి వెళ్లిపోయామని వారు చెప్పారు. కాగా, మురికివాడ నుంచి మాత్రం తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని వివరించారు. అయితే ఓ వర్గం మాత్రం మత మార్పిడి యత్నం జరిగిందని ఆరోపించింది. -
‘నోటా’కు ఓటేస్తాం.. మా సత్తా చూపుతాం!
కోల్‌కతా: ప్రస్తుత ఎన్నికల్లో నోటా (నాన్ ఆఫ్ ది అబౌ)’ ఆప్షన్ కు ప్రజాదరణ పెరుగుతుందనడానికి ఇదో చక్కటి ఉదాహరణ. ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అకస్మాత్తుగా తమ గుడిసెలను కూల్చేసి తమను వీధుల పాలు చేసినందుకు ఇక్కడి తొప్సియా ప్రాంతంలోని మురికి వాడల ప్రజలు ఈ ఎన్నికల్లో నోటాతో నిరసన తెలపాలనుకుంటున్నారు. ప్రత్యామ్నాయ పునరావాసం చూపించకుండా ఇలా వ్యవహరించినందుకు వారు మండిపడుతున్నారు. 2012 నవంబర్లోనే వారిని అక్కడినుంచి పంపించేసినా.. ఆ పాత అడ్రస్‌తోనే వారికి ఎన్నికల గుర్తింపు కార్డులున్నాయి. తొప్సియా మురికివాడలో దాదాపు 380కు పైగా కుటుంబాలున్నా దాదాపు వారంతా రిక్షా కార్మికులుగా, రోజువారీ కూలీలుగా, రోడ్లపై చెత్త ఏరుకునేవారిగా బతికేవారే. వారి ఇళ్లను కూల్చేసే సమయంలో వారిలో కొందరికి రూ. 12 వేలు, మరికొందరికి రూ. 10 వేలు పరిహారంగా ఇచ్చి అక్కడి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. చాలామందికి ఆ కొద్ది మొత్తం పరిహారం కూడా అందలేదు. అప్పటినుంచి వారంతా రోడ్డు పక్కన, ఫుట్‌పాత్‌లపై జీవనం సాగిస్తున్నారు. వారి పిల్లలు చదువుకు దూరమయ్యారు. దాంతోపాటు ఎలాంటి రక్షణ లేకపోవడంతో చాలామంది పిల్లలు అపహరణకు గురయ్యారు. ఎన్నోసార్లు ప్రజా ప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు మొర పెట్టుకున్నా వారికి ఎలాంటి ఫలితం లభించలేదు. దాంతో ఈ సారి ఓటుహక్కును ఆయుధంగా చేసుకుంటామని, నోటాను ఉపయోగించుకుంటామని వారు చెబుతున్నారు. అడ్రస్‌తో కూడిన ఫొటో గుర్తింపు కార్డులున్న వారిని ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా, ప్రత్యామ్నాయ పునరావాసం కల్పించకుండా వారి ఇళ్లను కూల్చేయడంతో వారు నోటాను ఎంచుకుని నేతలకు తగిన బుద్ధి చెబుతామంటున్నారు.