నలుగురు హైదరాబాదీ విద్యార్థుల అరెస్ట్ | Al Qaeda announces indian wing,Four hyderabadi students arrest in kolkata | Sakshi
Sakshi News home page

నలుగురు హైదరాబాదీ విద్యార్థుల అరెస్ట్

Published Fri, Sep 5 2014 9:26 AM | Last Updated on Wed, Sep 19 2018 6:31 PM

Al Qaeda announces indian wing,Four hyderabadi students arrest in kolkata

కోల్కతా :  కోల్కతాలో నలుగురు హైదరాబాదీ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఎస్ఎస్ సంస్థలో చేరేందుకు హైదరాబాద్ నుంచి బంగ్లాదేశ్ మీదగా ఇరాక్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నఈ నలుగురిని నిన్న సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కల్లోల ప్రాంతమైన ఇరాక్,  సౌత్ సిరియాలో పని చేసేందుకు వీరు వెళుతున్నట్లు తెలుస్తోంది.

 

గతంలో వీరికి పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించినట్లు సమాచారం. కాగా కోల్కతా పోలీసులు హైదరాబాదీ యువకుల సమాచారాన్ని నగర పోలీసులకు తెలిపారు. కాగా నిషేధిత సంస్థ అల్‌కాయిదా భారత ఉపఖండంలో కొత్త శాఖను  ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ నలుగురు పోలీసులకు చిక్కారు. మరోవైపు అల్‌కాయిదా తాజా వీడియో నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement