ఐజీఎన్‌సీఏ చీఫ్ ఆర్బీ రాయ్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ పాత్రను ప్రశ్నిస్తూ.. ఇందిరాగాంధీ జాతీయ కళల కేంద్రం(ఐజీఎన్‌సీఏ) అధ్యక్షుడు రాం బహదూర్ రాయ్ వ్యాఖ్యలు చేశారన్న వార్తలు దుమారం రేపుతున్నాయి. ఏబీవీపీ, ఆరెస్సెస్‌లలో పనిచేసిన రాయ్, ‘అంబేడ్కర్ అసలు రాజ్యాంగాన్ని రాయలేదు. ఇందులో ఆయన పాత్రేమీ లేదు. రాజ్యాంగ నిర్మాణానికి కావాల్సిన సమాచారాన్ని అప్పటి ఉన్నతాధికారైన బీ.ఎన్. రావు సేకరించారు.
కీర్తి ఆయనకు దక్కాలి’ అని అన్నట్లు ఓ పత్రిక ప్రచురించింది. రాజ్యాంగానికి నిప్పుపెట్టాలనుకుంటే ముందు తనే ఆ పనిచేస్తానన్నారని పేర్కొంది. దీనిపై బీజేపీ ఎస్సీ విభాగం చీఫ్ దుష్యంత్ మండి పడ్డారు. దళితులకు చేరువవుతున్న మోదీకి అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. తను ఇంటర్వ్యూ ఇవ్వలేదని.. జర్నలిస్టు విలువలకు పాతరేశారని రాయ్ అన్నారు.
రాజ్యాంగ నిర్మాణంలో అంబేడ్కర్ పాత్ర శూన్యం
Published Wed, Jun 8 2016 1:38 AM | Last Updated on Mon, Sep 4 2017 1:55 AM
Advertisement