
‘కశ్మీర్‌లో ప్రభుత్వం’పై సంఘ్‌తో షా మంతనాలు
న్యూఢిల్లీ: కశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో బీజేపీ సంఘ్ నేతల అభిప్రాయాన్నీ కోరుతోంది. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ డిమాండ్లపై ఏ విధమైన వైఖరి అవలంబించాలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఆర్‌ఎస్‌ఎస్ అగ్రనేతలతో జందేవాలన్ కార్యాలయంలో గురువారం చర్చలు జరిపారు. సైనిక దళాల ప్రత్యేకాధికారాల చట్టం(ఏఎఫ్‌ఎస్‌ఏ), 370 అధికరణం అంశాలపై పీడీపీ రాతపూర్వకమైన హామీని కోరుతున్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకు పోవాలన్న అంశంపై షా సంఘ్ నేతలతో చర్చించినట్లు సమాచారం.