బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షా పేరు ఖారారు
బీజేపీ జాతీయ నూతన అధ్యక్షుడిగా ప్రధాని నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడు అమిత్ షా పేరును బీజేపీ ఆగ్రనేతలు ఖరారు చేశారు. బుధవారం జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో అమిత్ షా పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అమిత్ షా కు బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతల్ని అప్పగించేందుకు రేపు పార్లమెంటరీ బోర్డు సమావేశమవుతోంది.
అంతా అనుకున్నట్టుగా జరిగితే ప్రస్తుత హోంశాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ నుంచి బీజేపీ అధ్యక్ష బాధ్యతల్ని అమిత్ షా స్వీకరిస్తారు. గత లోకసభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ తోపాటు, ఉత్తర భారతంలో గణనీయమైన సంఖ్యలో సీట్లను సొంతం చేయడం వెనుక అమిత్ షా వ్యూహాలు, కృషి ఉన్నట్టు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. గత ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ లోని 80 సీట్లలో 71 స్థానాలు బీజేపీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.