అవకాశాలు వెల్లువెత్తొచ్చు..! | Anjali Patil hopes 'Finding Fanny' opens new doors for her | Sakshi
Sakshi News home page

అవకాశాలు వెల్లువెత్తొచ్చు..!

Published Wed, Sep 24 2014 10:32 PM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM

అవకాశాలు వెల్లువెత్తొచ్చు..! - Sakshi

అవకాశాలు వెల్లువెత్తొచ్చు..!

 న్యూఢిల్లీ: భవిష్యత్తులో మంచి మంచి ప్రాజెక్టులు తనకు వచ్చేందుకు మార్గం సుగమమైనట్టేనని ‘ఫైండింగ్ ఫ్యానీ’ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించిన నటి అంజలి పాటిల్ భావిస్తోంది. తనను కొత్త కోణంలో ప్రేక్షకులు చూసే అవకాశం ఈ సినిమాతో లభించిందంది. కొత్త అవకాశాలకు ఇది దోహదం చేస్తుందని భావిస్తున్నానంటూ కొన్ని కలల సంఘటనలతోపాటు సినిమా చివరిలో కనిపించిన ఈ 27 ఏళ్ల వర్ధమాన తార తన మనసులో మాట బయటపెట్టింది. ‘ఈ సినిమాలో నేను గ్లామరస్ పాత్రలో కనిపించా. గతంలో ఇటువంటి పాత్ర దొరకనే లేదు.

‘ఫైండింగ్ ఫ్యానీ’లో సినిమాలో నటించిన కారణంగా మున్ముందు నాకు గ్లామరస్ పాత్రలు దొరికే అవకాశముంది’ అని అంది. హోమి అడజానియా తీసేసినిమాల్లో అతిథి పాత్ర దొరికినా చేసేందుకు తనకు ఎటువంటి అభ్యంతరమూ లేదంది. పైగా సంతోషిస్తానంది. ‘ఫైండింగ్ ఫ్యానీ’ సినిమాలో చిన్న పాత్ర అయినా అభ్యంతరం చెప్పేందుకు తనకు ఎటువంటి కారణమూ దొరకలేదంది. ‘ ఈ సినిమా ఎంతో బాగుంది. ఈ సినిమాలో అవకాశం కోసం నన్ను అప్పట్లో సంప్రదించడం ఇప్పుడు ఎంతో సంతోషం కలిగిస్తోంది. హోమి.. ఓ అద్భుతమైన దర్శకుడు.

ఇక ఫైండింగ్ ఫ్యానీ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఈ సినిమాలో నటించాలంటూ నన్ను అప్పట్లో సంప్రదించాడు. ఆ తర్వాత నజీరుద్దీన్ షాతో కలసి షూటింగ్‌లో పాల్గొన్నా’ అని అంది. కాగా ‘ఢిల్లీ ఇన్ ఏ డే’ అనే అంతర్జాతీయ ప్రాజెక్టుతో అంజలి ... సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఆ సినిమాలో అంజలి నటనకు విమర్శకులు సైతం మంచి మార్కులు వేశారు. ‘నా బంగారు తల్లి’ అనే తెలుగు సినిమాలో నటించిన అంజలికి జాతీయ పురస్కారం దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement