అర్చనకు అదనపు బాధ్యతలు
న్యూఢిల్లీ: పారా మిలటరీ దళాల తొలి మహిళా చీఫ్‌గా రికార్డు సృష్టించిన సశస్త్ర సీమాబల్(ఎస్‌ఎస్‌బీ) డెరైక్టర్ జనరల్, సీనియర్ ఐపీఎస్ అధికారిణి అర్చన రామసుందరంకు కేంద్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆమెను ఫైర్ సర్వీస్, సివిల్ డిఫెన్స్ అండ్ హోంగార్డ్స్ విభాగానికి డెరైక్టర్ జనరల్‌గా నియమించింది.
తమిళనాడు కేడర్‌కు చెందిన 58 ఏళ్ళ రామసుందరం వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఎస్‌ఎస్‌బీ డీజీగా ఉంటారు. అంతకుముందు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) స్పెషల్ డైరెక్టర్‌గా ఆమె పనిచేశారు. ఆమెను 2014లో సీబీఐ అదనపు డైరెక్టర్‌గా నియమించడం వివాదాస్పదమైంది. ఆ నియామకాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో ఎన్సీఆర్బీకి బదిలీ చేశారు.