Archana Ramasundaram
-
సీబీఐ చరిత్రలోనే తొలిసారి..?
-
సీబీఐ చరిత్రలోనే తొలిసారి..?
న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) చరిత్రలో నూతన అధ్యాయం చోటుచేసుకోనుందా? ప్రతిష్టాత్మక సంస్థకు చీఫ్‌గా తొలిసారి మహిళా అధికారిని నియమించనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ మేరకు సోమవారం ప్రధాని మోదీ నేతృత్వంలో జరగనున్న త్రిసభ్య భేటీలో సీనియర్ ఐపీఎస్ అధికారిణి అర్చనా రామసుందరంను సీబీఐ చీఫ్‌గా నియమిస్తారని ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏ.కె. సిన్హా రిటైర్మెంట్తో డిసెంబర్ 2న ఖాళీఅయిన సీబీఐ డైరెక్టర్ పదవిని కేంద్రం ఇప్పటిదాకా భర్తీ చేయలేదు. డిసెంబర్2నే గుజరాత్ కేడర్ ఐపీఎస్ అధికారి ఆర్.కె.ఆస్తానాను ఇన్చార్జి డైరెక్టర్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఆ నియామకంపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగడమేకాక, పార్లమెంట్‌లోనూ చర్చనీయాంశమైంది. ఆస్తానా నియామకాన్ని సవాలుచేస్తూ ప్రముఖ న్యయవాది ప్రశాంత్‌భూషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదాల నేపథ్యంలో అస్తానాను ఇన్చార్జిగానో లేక పూర్తిస్థాయి డైరెక్టర్‌గానో కొనసాగించలేని పరిస్థితి నెలకొంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జె.ఎస్. ఖేహర్, లోక్‌సభలో రెండో అతిపెద్ద పార్టీ(కాంగ్రెస్) నేత మల్లిఖార్జున ఖర్గేలు సభ్యులుగా ఉన్న ఎంపిక కమిటీ మరికొద్ది గంటల్లోనే తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. తమిళనాడు కేడర్ ఐపీఎస్ అధికారిణి అర్చనా రామసుందరం ప్రస్తుతం సశస్త్రసీమాబల్(ఎస్ఎస్బీ) కు చీఫ్‌గా కొనసాగుతున్నారు. సీబీఐ డైరెక్టర్ పదవికి కేంద్రం దాదాపు 45 మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను పరిశీలించినట్లు సమాచారం. వీరిలో అర్చనా రామసుందరం, కృష్ణచౌదరీ,ఎస్సీ మాథూర్‌లతో పాటు తెలంగాణలో పనిచేస్తోన్న అరుణ బహుగుణలు బలమైన పోటీదారులుగా భావిస్తున్నారు. వీరందరిలోకీ అర్చనకే ఎక్కువ అవకాశాలున్నాయని, ఆమే తుదుపరి సీబీఐ డెరెక్టర్ అవుతారని సమాచారం. -
అర్చనకు అదనపు బాధ్యతలు
న్యూఢిల్లీ: పారా మిలటరీ దళాల తొలి మహిళా చీఫ్‌గా రికార్డు సృష్టించిన సశస్త్ర సీమాబల్(ఎస్ఎస్బీ) డెరైక్టర్ జనరల్, సీనియర్ ఐపీఎస్ అధికారిణి అర్చన రామసుందరంకు కేంద్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆమెను ఫైర్ సర్వీస్, సివిల్ డిఫెన్స్ అండ్ హోంగార్డ్స్ విభాగానికి డెరైక్టర్ జనరల్‌గా నియమించింది. తమిళనాడు కేడర్‌కు చెందిన 58 ఏళ్ళ రామసుందరం వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఎస్ఎస్బీ డీజీగా ఉంటారు. అంతకుముందు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) స్పెషల్ డైరెక్టర్‌గా ఆమె పనిచేశారు. ఆమెను 2014లో సీబీఐ అదనపు డైరెక్టర్‌గా నియమించడం వివాదాస్పదమైంది. ఆ నియామకాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో ఎన్సీఆర్బీకి బదిలీ చేశారు. -
విధుల్లో చేరిన రోజే సస్పెన్షన్
న్యూఢిల్లీ/చెన్నై: తమిళనాడు కేడర్ ఐపీఎస్ అధికారిణి అర్చన రామసుందరం(56)కు విచిత్ర పరిస్థితి ఎదురైంది. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐలో మొదటి మహిళా అదనపు డెరైక్టర్‌గా గురువారం బాధ్యతలు స్వీకరించిన కాసేపటికే ఆమెను సస్పెం డ్ చేస్తూ తమిళనాడు ప్రభత్వం నిర్ణయం తీసుకుంది. అదనపు డెరైక్టర్‌గా బాధ్యతలు తీసుకునేముందు పాటించాల్సిన విధి, విధానాలను ఉల్లంఘించడం వల్లనే ఆమెను సస్పెండ్ చేసినట్లు రాష్ట్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి. అర్చన రామసుందరం సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని, క్రమశిక్షణ చర్యల ప్రక్రియ కొనసాగుతున్నందున ఆమె చెన్నైలోనే ఉండాలని రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర విజిలెన్స్ కమిషన్, కేంద్ర హోం శాఖ వ్యతిరేకించి, వేరే అధికారి పేరును సూచించినప్పటికీ సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా అదనపు డెరైక్టర్ పదవికి అర్చన పేరును సిఫారసు చేశారు. దాంతో ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ అర్చనను ఖరారు చేసింది. సీబీఐలో జాయింట్ డెరైక్టర్ హోదా అందుకున్న మొదటి మహిళ కూడా ఆమెనే కావడం విశేషం. అదనపు డెరైక్టర్‌గా ఆమె నియామకాన్ని సవాలు చేస్తూ జర్నలిస్ట్ వినీత్ నారాయణ్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ విచారణ శుక్రవారం జరగనుంది. -
సీబీఐ అదనపు డెరైక్టర్‌గా అర్చనా రామసుందరం
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అదనపు డెరైక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారిణి అర్చనా రామసుందరం శుక్రవారం నియమితులయ్యారు. సీబీఐలో ఒక మహిళ ఈ పదవి చేపట్టడం ఇదే తొలిసారి. 1980 తమిళనాడు కేడర్‌కు చెందిన అర్చనకు సీబీఐ మాతృసంస్థ. ఆమె ఇందులో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్‌గా, జాయింట్ డెరైక్టర్‌గా పనిచేశారు. ఈ సంస్థలో తొలి మహిళా జాయింట్ డెరైక్టర్ కూడా ఆమే. 1996-2006 మధ్య ఆమె తెల్గీ స్టాంపుల కుంభకోణం వంటి పలు ఆర్థిక నేరాలపై దర్యాప్తు జరిపారు. ఆమె గతంలో తమిళనాడు అదనపు డీజీపీగా కూడా పనిచేశారు. ప్రస్తుతం తమిళనాడు యూనిఫామ్డ్ సర్వీస్ రిక్రూట్మెంట్ డెరైక్టర్ జనరల్‌గా ఉన్న అర్చనను సీబీఐ అదనపు డెరైక్టర్‌గా నియమించాలని సీబీఐ డెరైక్టర్ రంజింగ్ సిన్హా సిబ్బంది శాఖకు గట్టిగా సిఫార్సు చేశారు. ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ దీనికి ఆమోదం తెలిపింది.