సాక్షి,బెంగళూర్: కర్నాటక తొలి మహిళా పోలీస్ చీఫ్‌గా ఐపీఎస్ అధికారి నీలమణి ఎన్ రాజు నియమితులయ్యారు. డీజీ,ఐజీపీ ఆర్‌కే దత్తా పదవీవిరమణ చేయడంతో మంగళవారం నూతన డీజీపీగా నీలమణిరాజు నియామకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. సీఐడీ చీఫ్ కిషోర్ చంద్ర, ఏసీబీ హెడ్ ఎంఎన్ రెడ్డిలు ఈ పదవికి పోటీపడ్డా 1983 బ్యాచ్ కర్నాటక కేడర్‌కు చెందిన నీలమణికే ప్రతిష్టాత్మక పోస్ట్ దక్కింది. సీనియర్ అధికారి కావడంతో నీలమణి వైపు సర్కార్ మొగ్గుచూపింది. ప్రస్తుత చీఫ్ ఆర్‌కే దత్తాకు మూడునెలలు పొడిగింపు ఇవ్వచ్చని భావించినా చివరకూ నీలమణి నియామకాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
హోంమంత్రి రామలింగారెడ్డి నేతృత్వంలోని అత్యున్నత ఎంపిక కమిటీ ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌లతో కూడిన జాబితాను సీఎం సిద్ధరామయ్యకు సమర్పించింది. వీరిలో అత్యంత సీనియారిటీ కలిగిన నీలమణిని ప్రభుత్వం డీజీ,ఐజీపీగా నియమించింది. మరోవైపు కర్నాటకలో తొలిసారిగా మహిళా పోలీస్ చీఫ్ నియమితులయ్యారని ఐపీఎస్ అసోసియేషన్ ట్వీట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment