న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం లోక్సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. గురువారం లోక్ సభలో ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది వృద్ధిరేటు 5 శాతానికి తక్కువగానే ఉందని ఆర్థిక సర్వే తెలిసింది. 2014-15లో జీడీపీ వృద్ధి 5.4నుంచి 5.9 శాతం పెరుగుతుందని అంచనా. ఏప్రిల్ నుంచి పారిశ్రామిక రంగంలో వృద్ది సాధించవచ్చని ఆర్థిక సర్వే పేర్కొంది. జీడీపీ వృద్ధిరేటు 5.4నుంచి 5.9వరకు పెరగవచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఇక కీలక వడ్డీ రేట్లు తగ్గవచ్చని తెలుస్తోంది. ఆర్థిక సర్వే వివరాలు:
*ఈ ఏడాది ఎల్‌నినో వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి
*ఉపాధి హామీతో కార్మికుల కొరత ఏర్పడింది, ధరల పెరిగాయి
*ద్రవ్యోల్బణం కొంత తగ్గింది కానీ.. ఇప్పటికీ భరించే స్థాయికంటే ఎక్కువగా ఉంది
*ఈ ఏడాది ఆఖరుకు స్థూల ద్రవ్యోల్బణం తగ్గొచ్చు
*ఇంటా బయటా తలెత్తిన పరిస్థితులతో...ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది
*ఆర్థిక లోటు తగ్గాలంటే సబ్సిడీలను హేతుబద్ధం చేయాల్సిందే
*ఆర్థిక లోటు, కరెంట్ అకౌంట్ లోటు తగ్గడం...దీర్ఘకాలంలో వృద్ధిరేటును పెంచుతుంది
*చెల్లింపుల సమతుల్యం (బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్) మెరుగుపడింది
*ఈ ఆర్థిక సంవత్సరంలో...జీడీపీ వృద్ధిరేటు అంచనాలను కష్టపడి అందుకోవచ్చు
*వచ్చే రెండేళ్లలో ఆర్థిక లోటు తగ్గుతుంది
*ఎరువులకు పోషకాల ఆధారిత సబ్సిడీ ఇవ్వాలి
*మార్కెట్ల ధరలకు అనుగుణంగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచాలి
*వివిధ దేశాల మధ్య తలెత్తుతున్న ఉద్రిక్త పరిస్థితులతో ఇండియాకు కష్టం, నష్టం
*వ్యవసాయ ఉత్పత్తులకు ఉమ్మడి మార్కెట్ ఉండాలి
*2013-14లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో 4.7 శాతం వృద్ధి
ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది
Published Wed, Jul 9 2014 1:20 PM | Last Updated on Sat, Sep 2 2017 10:03 AM
Advertisement
Advertisement