‘మోదీజీ.. తల్లి, భార్యతో కలిసే ఉండాలి’ | arvind kejriwal accused PM Modi of using his mother for political gain | Sakshi
Sakshi News home page

‘మోదీజీ.. తల్లి, భార్యతో కలిసే ఉండాలి’

Published Tue, Jan 10 2017 3:02 PM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM

‘మోదీజీ.. తల్లి, భార్యతో కలిసే ఉండాలి’ - Sakshi

‘మోదీజీ.. తల్లి, భార్యతో కలిసే ఉండాలి’

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఒక్క క్షణం కూడా పడదనుకుంటా. మోదీ ఏం చేసినా దానిపై చెడమడా సెటైర్లు వేయడం, విమర్షించడం కేజ్రీవాల్‌ అలవాటుగా చేసుకున్నట్లుంది. నిత్యం మోదీపై ఏదో ఒక కామెంట్‌ చేసే కేజ్రీవాల్‌ మంగళవారం కూడా ఆయనపై విమర్షనాత్మక వ్యాఖ్యలు చేశారు. తన తల్లిని కలిసి విషయాన్ని ప్రధాని మోదీ మంగళవారం ఉదయం ట్విట్టర్‌లో పంచుకోగా దానికి కూడా కేజ్రీవాల్‌ స్పందించారు.|

తాను కూడా ప్రతి రోజు తన తల్లిని కలుస్తున్నానని, ఆమె దీవెనలు తీసుకుంటున్నానని, అయితే, మోదీలాగా మాత్రం ఆ విషయాన్ని టామ్‌ టామ్‌ చేసుకోవడం లేదన్నారు. తల్లిని కలిసే విషయం కూడా ప్రపంచానికి చెప్పాల్సిన పనిలేదని అన్నారు. ‘ఈ రోజు నేను యోగాకు డుమ్మా కొట్టి మా అమ్మగారిని కలిసేందుకు వెళ్లాను. ఆమెతో కలిసి ఉదయం అల్పాహారం తీసుకున్నాను. మేమిద్దరం ఇలా గడపడం చాలా గొప్ప సందర్భం’ అని మోదీ అన్నారు. దీనికి స్పందించిన కేజ్రీవాల్‌ ‘హిందూ సంప్రదాయం ప్రతి వ్యక్తి తన తల్లిని, భార్యను తనతోనే ఉంచుకోవాలని చెబుతుంది. మీ ఇల్లు చాలా పెద్దది. మీ హృదయాన్ని కూడా విశాలంగా మార్చండి’  అంటూ కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. మోదీ తన రాజకీయ మైలేజ్‌ కోసం తల్లిని కూడా ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement