
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా విజృంభిస్తోన్న సమయంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అస్వస్థతకు గురయ్యారు. నిన్న మధ్యాహ్నం నుంచి ఆయన జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నారని తెలిసింది. ప్రస్తుతం కేజ్రీవాల్ సమావేశాలన్నీ రద్దు చేసుకుని స్వీయనిర్బంధంలో ఉండిపోయారు. రేపు కేజ్రీవాల్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీలో 28,936 కరోనా కేసులు నమోదు కాగా 812మంది మరణించారు. (కేజ్రీ వర్సెస్ డాక్టర్స్)