కేజ్రీవాల్కు తృటిలో తప్పిన ప్రమాదం | Arvind Kejriwal's car hit a police vehicle in Punjab | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్కు తృటిలో తప్పిన ప్రమాదం

Published Fri, Sep 9 2016 11:12 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

కేజ్రీవాల్కు తృటిలో తప్పిన ప్రమాదం - Sakshi

కేజ్రీవాల్కు తృటిలో తప్పిన ప్రమాదం

చండీగఢ్: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. శుక్రవారం ఉదయం పంజాబ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రయాణిస్తున్న కారు వాహనశ్రేణిలోని పోలీస్ వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో కేజ్రీవాల్తో పాటు అదే కారులోఉన్న ఆప్ నేతలు సురక్షితంగా బయటపడ్డారు. సీట్ బెల్ట్ ధరించడంతో కేజ్రీవాల్కు ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో కేజ్రీవాల్ ప్రయాణిస్తున్న ఇన్నోవా ముందు భాగం దెబ్బతింది. దీంతో అధికారులు ఆయనను వేరే వాహనంలో తరలించారు. పంజాబ్లో మూడు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన కేజ్రీవాల్.. ఇవాళ గోల్డెన్ టెంపుల్ను సందర్శించనున్నారు. కేజ్రీవాల్ పర్యటన నేపథ్యంలో అధికారలు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement