సాక్షి, న్యూఢిల్లీ : రాజస్ధాన్‌లో కాంగ్రెస్ సారథ్యంలో ఏర్పాటయ్యే ప్రభుత్వానికి సారధి ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. సీనియర్ నేత అశోక్ గెహ్లాట్, యువనేత సచిన్ పైలట్‌లు సీఎం రేసులో తీవ్రంగా పోటీపడుతున్నారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ నిర్ణయం కీలకంగా మారడంతో పార్టీ నేతలతో ఆయన విస్తృతంగా సంప్రదింపులు జరుపుతున్నారు.
పార్టీ ఎమ్మెల్యేలు సహా సీనియర్ నేతలందరి అభిప్రాయాలను కేంద్ర పరిశీలకులు సేకరించారని, రాహుల్ గాంధీ ఈ అంశంపై గురువారం ఓ నిర్ణయం తీసుకుంటారని సీఎం రేసులో నిలిచిన అశోక్ గెహ్లాట్ చెప్పారు. రాజస్ధాన్ సీఎం ఆశావహులు గెహ్లాట్, సచిన్ పైలట్‌లు ఇద్దరూ ఢిల్లీలోనే మకాం వేసి రాహుల్‌తో మంతనాలు జరుపుతున్నారు. కాగా మధ్యప్రదేశ్ సీఎంగా కమల్‌నాథ్ ఖరారయ్యాయరని, రాజస్ధాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్, చత్తీస్‌గఢ్ సీఎంగా ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ భూపేష్ బాఘేల్‌లను సీఎం రేసులో ముందున్నారని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment