సన్మానసభకు హాజరైన ప్రముఖులు
భువనేశ్వర్ : ప్రజా సేవలో నిర్విరామ కృషి చేసిన పలువురు శాసనసభ్యులను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అభినందించారు. రాష్ట్ర శాసనసభ సమావేశ మందిరంలో సన్మాన సభ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల ప్రజలకు విశేష సేవలందించిన ఆయా శాసనసభ్యులను పలు పురస్కారాలతో ముఖ్యమంత్రి సత్కరించారు. మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత శాసనసభ్యులు, నూతనంగా ఎన్నికైన ఆయా శాసనసభ్యులకు మొత్తం మూడు విభాగాల్లో ఈ పురస్కారాలను ముఖ్యమంత్రి అందజేశారు. రాష్ట్రంలోని సుమారు 24 మంది శాసనసభ్యులకు ఈ గౌరవం దక్కడం విశేషం. ఉత్తమ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పండిత నీలకంఠ పురస్కారం, మాజీ ఎమ్మెల్యేలకు ఉత్కళ గౌరవ్ మధుసూదనదాస్ అవార్డు,కొత్త ఎమ్మెల్యేలకు ఉత్కళమణి గోపబంధు ప్రతిభా పురస్కారం ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ 3 విభాగాల కింద ఏటా ముగ్గురు చొప్పున 2009 నుంచి 2016 సంవత్సరం వరకు పనిచేసిన సుమారు 24 మంది ఉన్నత ఎమ్మెల్యేలను ఈ పురస్కారాలకు ఎంపిక చేసినట్లు పురస్కార కమిటీ తెలిపింది.పండిత నీలకంఠ పురస్కారం పొందిన వారిలోవిష్ణుచరణ్ దాస్(2009), డాక్టర్ అరుణ్‌కుమార్ సాహు(2010), ప్రభాత్‌రంజన్ బిశ్వాల్(2011), డాక్టర్ ప్రపుల్లమఝి(2012), అమరప్రసాద్ శత్పతి(2013), ప్రమీల మల్లిక్(2014), రణేంద్ర ప్రతాప్ స్వంయి(2015), డాక్టర్ రమేష్‌చంద్ర చౌ పట్నాయక్(2016) ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఉత్కళ గౌరవ మధుసూదన్ దాస్ పురస్కారాన్ని మాజీ ఎమ్మెల్యేలు సురేంద్రనాథ్ నాయక్(2009), బింబాధర్ కుంవర్(2010), నిత్యానంద ప్రదాన్(2011), ఉమేష్‌చంద్ర స్వంయి(2012), విక్రమ్ కేశరి వర్మ(2013), రాజేంద్ర డొలాకియా(2014), సురేంద్రప్రసాద్ పరమాణిక్(2015), చక్రధర్ పాయిక్(2016)లు అందుకున్నారు.
ఉత్కళ మణి గోపబంధు ప్రతిభా పురస్కారాన్ని కొత్త ఎమ్మెల్యేలు అయిన సంజయ్‌కుమార్‌దాస్ వర్మ(2009), ప్రీతిరంజన్ ఘొడై( 2010), సమీర్‌రంజన్ దాస్(2011), ప్రశాంత్‌కుమార్ ముదులి( 2012), విజయ్‌కుమార్ మహంతి(2013), డాక్టర్ రాజేశ్వరి పాణిగ్రాహి(2014), కెప్టెన్ దివ్యశంకర్ మిశ్రా(2015), ప్రదీప్ పురోహిత్(2016)లు అందుకున్నా రు.కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ప్రతిç ³క్ష నాయకుడు నరసింగ మిశ్రా, అసెంబ్లీ స్పీకర్ ప్రదీప్‌కుమార్ అమత్, శాసనసభ వ్యవహారాల విభాగం మంత్రి విక్రమ్‌కేశరి అరూఖ్, శాసనసభ్యులు, మంత్రులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment