ముగ్గురు అఖిల భారత అధికారులపై వేటు
న్యూఢిల్లీ: విధులు సరిగా నిర్వర్తించని, అవినీతి ఆరోపణలున్న అఖిల భారత స్థాయి అధికారులను కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగిస్తోంది. తాజాగా ఒక ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారులను ఉద్యోగాల నుంచి తీసేసింది. 1991 బ్యాచ్ ఏజీఎంయూటీ (అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం, కేంద్ర పాలిత ప్రాంతాలు) కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి నరసింహను నియామకాల కేబినెట్ కమిటీ ఆమోదం తర్వాత బుధవారం తొలగించారు. ఇదే కేడర్‌కు చెందిన 1998 బ్యాచ్ ఐపీఎస్ అధికారి మయాంక్ చౌహాన్, 1992 బ్యాచ్ ఛత్తీస్‌గఢ్ కేడర్ అధికారి రాజ్‌కుమార్ దేవాంగన్‌లను కేంద్ర హోం శాఖ మంగళవారమే తొలగించింది.