ఆసుపత్రి నిర్లక్ష్యం: తల్లీబిడ్డలకు కరోనా | Baby And Mother Get Coronavirus After Mumbai Hospital Puts Them On Corona Patient Bed | Sakshi
Sakshi News home page

ఆసుపత్రి నిర్లక్ష్యం: తల్లీబిడ్డలకు కరోనా

Published Thu, Apr 2 2020 12:13 PM | Last Updated on Thu, Apr 2 2020 1:48 PM

Baby And Mother Get Coronavirus After Mumbai Hospital Puts Them On Corona Patient Bed - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ముంబై : ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోజుల పసిబిడ్డకు, బిడ్డ తల్లికి కరోనా వైరస్‌ సోకింది. ఈ విషాద ఘటన ముంబైలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన 26 ఏళ్ల యువతి ఈ నెల 26న ఇంటివద్ద ఓ బిడ్డకు జన‍్మనిచ్చింది. పసిబిడ్డ పరిస్థితి బాగోలేకపోవటంతో ఆమె భర్త తల్లీబిడ్డలను చెంబూర్‌ ఆసుపత్రిలో చేర్చాడు. అక్కడ సరైన చికిత్స అందటం లేదన్న కారణంతో కుర్లా బాబా ఆసుపత్రికి మార్చాడు. ఆ ఆసుపత్రిలోనూ అదే పరిస్థితి ఎదురుకావటంతో అక్కడినుంచి కస్తూర్భా ఆసుపత్రికి వారిని తీసుకెళ్లాడు. అక్కడి వైద్యులు తల్లీబిడ్డలలో కరోనా లక్షణాలను గుర్తించి పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో వారికి కరోనా సోకినట్లు తేలింది. కాగా, చెంబూర్‌ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తల్లీబిడ్డలకు వైరస్‌ సోకిందని, వారిని కరోనా పేషంట్‌ బెడ్‌ మీద ఉంచటమే ఇందుకు కారణమని బాధితుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

చదవండి : కరోనా : పెంగ్విన్‌ ఫీల్డ్‌ ట్రిప్‌ !!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement