ఓబీసీలకు 27% రిజర్వేషన్ అమలు కావడం లేదు' | Bandaru Dattatreya attend B P Mandal birth anniversary | Sakshi
Sakshi News home page

ఓబీసీలకు 27% రిజర్వేషన్ అమలు కావడం లేదు'

Published Thu, Aug 25 2016 8:20 PM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM

Bandaru Dattatreya attend  B P Mandal birth anniversary

న్యూఢిల్లీ: జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. గురువారం ఏపీ భవన్ లో జరిగిన బీపీ మండల్ 98వ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ ఓబీసీ పార్లమెంటరీ కమిటీకి చట్టబద్దత కల్పించడానికి తనవంతు కృషి చేస్తామన్నారు.

ఇందుకోసం అన్ని పార్టీల ఏకాభిప్రాయం అవసరమన్నారు.  త్వరలోనే ప్రధానమంత్రిని కలిసి చట్టబద్ధత కల్పించాలని కోరతామని దత్తాత్రేయ తెలిపారు. ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్లు అమలు కావడం లేదన్నారు. బీసీల అభ్యున్నతికి బీపీ మండల్ కృషి అభినందనీయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రాపోల్ ఆనంద్ భాస్కర్, మందకృష్ణ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement